Allu Arjun | అల్లు అర్జున్‌కు లారీ గిఫ్ట్.. ఇంతకీ ఎవరిచ్చారో తెలుసా..?
పుష్ప సినిమాలో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ (Allu Arjun) నటనకు క్రికెటర్లతోపాటు వరల్డ్ వైడ్‌గా చాలా మంది సెలబ్రిటీలు సైతం ఫిదా అయిపోయారు. ఓ వ్యక్తి నుంచి ప్రత్యేకమైన గిఫ్ట్‌ను అందుకున్నాడు బన్నీ.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకోవడమే కాకుండా.. వరల్డ్ వైడ్‌గా సూపర్ క్రేజ్ దక్కించుకున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun). ఈ సినిమాతో అల్లు అర్జున్ అభిమానుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. పుష్పరాజ్‌గా బన్నీ నటనకు క్రికెటర్లతోపాటు వరల్డ్ వైడ్‌గా చాలా మంది సెలబ్రిటీలు సైతం ఫిదా అయిపోయారు. ఈ చిత్రంలో పుష్పరాజ్ ఎర్రచందనం అక్రమ రవాణా చేసే లారీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఇపుడిదే గిఫ్ట్‌ను ఓ ప్రత్యేకమైన వ్యక్తి నుంచి అందుకున్నాడు బన్నీ. ఇంతకీ అతడెవరనే కదా మీ డౌటు. బన్నీ కుమారుడు అల్లు అయాన్ (Allu Ayaan). పుష్ప థీమ్‌తో ఉన్న లారీ టాయ్ (lorry toy)ని కుమారుడి నుంచి గిఫ్టుగా అందుకున్న సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నాడు అల్లు అర్జున్. నా ప్రియమైన అయాన్ చిన్నిబాబు నుంచి అందమైన కానుక అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో లారీ ఫొటోను పోస్ట్ చేశాడు.
అల్లు అర్జున్ ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సీక్వెల్ పుష్ప.. ది రూల్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. రామోజీఫిలింసిటీలో జరుగబోతున్న షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు బన్నీ. మైత్రీ మూవీ మేకర్స్ ఫస్ట్ పార్టును మించిన బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సీక్వెల్లో కూడా కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఫహద్ ఫాసిల్ కీ రోల్లో నటించనుండగా.. రెండో పార్టులో కొత్త నటీనటులెవరు కనిపిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
అల్లు అర్జున్ అందుకున్న గిఫ్ట్ ఇదే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

