Mallu Arjun | కేరళలో ‘మల్లు అర్జున్’ సరికొత్త రికార్డు.. రీ-రిలీజ్ మూవీతో చరణ్, ప్రభాస్ ఆల్ టైం కలెక్షన్లను దాటేసిన బన్నీ!
Mallu Arjun | టాలీవుడ్ స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఇతర పరిశ్రమలలోనూ భారీ క్రేజ్ సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
Mallu Arjun | టాలీవుడ్ స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఇతర పరిశ్రమలలోనూ భారీ క్రేజ్ సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్, టాలీవుడ్ హీరోలు పరస్పరం ఇతర భాషల్లో సత్తా చాటుతున్న తరుణంలో, ఒక టాలీవుడ్ స్టార్ హీరో మాత్రం మన పొరుగు ఇండస్ట్రీలో అక్కడి లోకల్ హీరోల రేంజ్లో రికార్డులు సృష్టిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇంతకీ అతనెవరో కాదు. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కేరళ ప్రజలు ముద్దుగా అతడిని మల్లు అర్జున్ అని పిలుస్తారు. ‘పుష్ప’, ‘పుష్ప 2’ చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో ఇమేజ్ తెచ్చుకున్న బన్నీ, ప్రస్తుతం కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ‘రాక’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ గ్యాప్‌లో కేరళలో ఆయన పాత సూపర్ హిట్ సినిమా ‘హ్యాపీ’ని 4కే వెర్షన్లో రీ-రిలీజ్ చేయగా, అక్కడ కలెక్షన్ల సునామీ సృష్టించింది. ముఖ్యంగా ప్రభాస్, రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ల సినిమాలను సైతం కలెక్షన్ల పరంగా వెనక్కి నెట్టి కేరళ బాక్సాఫీస్ వద్ద తన ప్రత్యేకతను చాటుకున్నారు అల్లు అర్జున్.
ప్రభాస్ ‘ది రాజా సాబ్’తో పాటు ఇటీవల వచ్చిన రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలు సైతం కేరళలో ఇప్పటివరకు కోటి రూపాయల మార్కును అందుకోలేక తీవ్రంగా ఇబ్బంది పడుతుంటే అల్లు అర్జున్ కేవలం తన ‘హ్యాపీ’ సినిమా రీ-రిలీజ్‌తోనే ఈ మార్క్‌ను అందుకున్నాడు. ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే రూ. 95.5 లక్షల గ్రాస్ వసూలు చేసింది. నాల్గవ రోజు అడ్వాన్స్ బుకింగ్స్‌తో కలిపి ఈ చిత్రం రూ. 1 కోటి దాటినట్లు చిత్రబృందం ప్రకటించింది. మొదటి రోజు రూ. 35 లక్షలు, రెండో రోజు రూ. 28 లక్షలు, మూడో రోజు రూ. 32.5 లక్షలకు పైగా వసూళ్లు సాధించి కేరళలో బన్నీకి ఉన్న తిరుగులేని ఫ్యాన్ బేస్‌ను మరోసారి నిరూపించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

