పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెత అల్లు అర్హకు సరిగ్గా సరిపోతుంది. బన్నీ-స్నేహా రెడ్డి ముద్దుల కూతురు అర్హ నెటిజన్స్‌కి చాలా సుపరిచితం. ఈ చిన్నారి అల్లరి ప్రతి ఒక్కరికి చూడముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది. పాపకి సంబంధించిన వీడియోలను స్నేహా రెడ్డి ఎప్పుడు షేర్ చేసిన అది కొద్ది క్షణాలలోనే వైరల్ అవుతూ ఉంటుంది. ‘శాకుంతలం’ సినిమాతో వెండి తెర ఎంట్రీ ఇచ్చిన అర్హ తన తొలి సినిమాలోనే అద్భుత నటనతో ఆకట్టుకుంది . ఈ విషయాన్ని సమంత పలు సందర్భాలలో చెప్పుకొచ్చింది.
ఇక ఇటీవల అర్హ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అత్యంత పిన్న వయసులోనే చెస్‌లో శిక్షణ ఇస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రపంచంలోనే పిన్న వయస్కురాలైన చెస్ ట్రైనర్‌గా నిలిచింది. చెస్‌పై ఆమెకున్న ఆసక్తిని గమనించిన కుటుంబ సభ్యులు అర్హని ఓ చెస్ అకాడమీలో శిక్షణ ఇప్పించారు. అర్హ తాను నేర్చుకోవడమే కాకుండా ఇతరులకూ నేర్పించే ప్రయత్నం చేసింది. రెండు నెలల వ్యవధిలో 50 మందికి పైగా ట్రైనింగ్ ఇచ్చింది. ఆమె నైపుణ్యం గుర్తించి ‘వరల్డ్ యంగెస్ట్ చెస్ ట్రైనర్’ అవార్డును అందించారు.
తండ్రి మాదిరిగానే అశేష ప్రేక్షకాదరణ పొందిన అర్హ తాజాగా ఏ మాత్రం భయపడకుండా రాక్ వాల్ ఎక్కింది. ఇందుకు సంబంధించిన వీడియోని స్నేహా రెడ్డి తన సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఇది వైరల్ అయింది. ఇందులో ఎనర్జీపై సమంత, ఈషాగుప్తాతో పాటు పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
https://www.instagram.com/reel/CXEE69clkEn/?utm_source=ig_web_copy_link