Godfather | చిరంజీవికి ఊహించని షాక్ ఇచ్చిన అల్లు అరవింద్.. దెబ్బకు గాడ్ ఫాదర్ ఔట్..
చిరంజీవికి అల్లు అరవింద్ షాక్ ఇవ్వడమేంటి అనుకుంటున్నారా..? వినడానికి కాస్త విచిత్రంగా ఉన్న ఇప్పుడు జరిగింది ఇదే. నిజానికి చిరంజీవి దెబ్బ కొట్టాలని అల్లు అరవింద్ తీసుకోలేదు.
Godfather | చిరంజీవికి అల్లు అరవింద్ షాక్ ఇవ్వడమేంటి అనుకుంటున్నారా..? వినడానికి కాస్త విచిత్రంగా ఉన్న ఇప్పుడు జరిగింది ఇదే. నిజానికి చిరంజీవి దెబ్బ కొట్టాలని అల్లు అరవింద్ తీసుకోలేదు.. కానీ అనుకోకుండా ఇప్పుడు ఆయన తీసుకున్న ఒక నిర్ణయం చిరు సినిమాను పూర్తిగా వాష్ అవుట్ అయ్యేలా చేసింది. అసలు విషయం ఏంటంటే.. రెండు రోజుల కింద విడుదలైన కాంతార సినిమా తెలుగులో అనూహ్య విజయం సాధించింది. నిజానికి ఈ పేరు కూడా దీనికి సరిపోదు సంచలన విజయం అనే మాట కూడా దానికి తక్కువే. 2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమాకు మొదటి రోజు 2 కోట్ల 10 లక్షల షేర్ వచ్చింది.
ఇక రెండో రోజు ఏకంగా 2.8 కోట్ల షేర్ వసూలు చేసి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మూడో రోజు కూడా కనీసం 1.5 కోట్లు వసూలు చేసేలా కనిపిస్తుంది ఈ సినిమా. ఫైనల్ రన్ లో కనీసం 15 కోట్ల షేర్ వసూలు చేయడం ఖాయం అయిపోయింది. ఇదంతా ఇలా ఉంటే ఈ సినిమా విడుదల కావడంతో.. చిరంజీవి గాడ్ ఫాదర్ పూర్తిగా బాక్సాఫీస్ దగ్గర వాష్ అవుట్ అయిపోయింది. మొదటి వారం 55 కోట్లకు షేర్ వసూలు చేసిన ఈ సినిమా రెండో వీకెండ్ కనీసం మరో 6 కోట్లయినా వసూలు చేస్తుందని అందరూ అనుకున్నారు.
దానికి కారణం కూడా లేకపోలేదు. ఈ వారం గాడ్ ఫాదర్ తప్ప ప్రేక్షకులు చూడడానికి మరో సినిమా లేదు అందుకే ఖచ్చితంగా రెండో వీకెండ్ కూడా చిరంజీవి సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తాయని అందరూ ఊహిస్తున్న తరుణంలో.. అల్లు అరవింద్ ఎవరు ఊహించిన విధంగా కన్నడ బ్లాక్ బస్టర్ కాంతార డబ్బింగ్ రైట్స్ తీసుకుని ఇక్కడ తెలుగులో విడుదల చేశాడు. రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా కన్నడలో 100 కోట్లు వసూలు చేసింది.
చాలా తక్కువ ప్రమోషన్ తో విడుదలైన ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా దెబ్బకు రెండో వీకెండ్ చిరంజీవి సినిమా కనీసం కనిపించలేదు. కాంతార దెబ్బకు గాడ్ ఫాదర్ అడ్రస్ గల్లంతయింది. ఇప్పటినుంచి వీక్ డేస్ కూడా ఈ కన్నడ డబ్బింగ్ సినిమా కోసం ప్రేక్షకులు ఎగబడతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ దెబ్బతో గాడ్ ఫాదర్ క్లోజింగ్ కలెక్షన్స్ 60 కోట్ల లోపే ముగిసేలా కనిపిస్తున్నాయి. మొత్తానికి అల్లు అరవింద్ సినిమా వచ్చి చిరంజీవి సినిమా పూర్తిగా బాక్సాఫీస్ బరి నుంచి తప్పించింది.
ఇవి కూడా చదవండి..
ఆత్మను వదిలేసిన సుకుమార్.. రెమ్యునరేషన్ ప్రధాన కారణమా..?
‘లైగర్’ తర్వాత మార్పు.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్కు నో చెప్పిన విజయ్..!
Karthi | మెగాఫోన్ పట్టనున్న కార్తి.. తొలి సినిమా ఆ స్టార్ హీరోతోనేనట..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

