Ugram | నా కెరీర్లో హయ్యెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్‌గా ఉగ్రం : అల్లరి నరేశ్
Ugram | అల్లరి నరేశ్ (Allari Naresh) నటిస్తోన్న ఉగ్రం (Ugram) మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా అల్లరి నరేశ్ క్వశ్చన్ & ఆన్సర్స్ సెషన్లో పాల్గొన్నాడు.
Ugram | అల్లరి నరేశ్ (Allari Naresh) నటిస్తోన్న ఉగ్రం (Ugram) మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నాంది ఫేం విజయ్ కనకమేడల (Vijaykanak Medala) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం రేపు థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లరి నరేశ్ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ప్రమోషన్స్ లో భాగంగా అల్లరి నరేశ్ క్వశ్చన్ & ఆన్సర్స్ సెషన్లో పాల్గొన్నాడు. ఉగ్రం ఫైనల్ కట్‌ను చూశానని, అవుట్‌పుట్ చూసి హ్యాపీగా అనిపించిందన్నాడు అల్లరి నరేశ్.
ఉగ్రం తన కెరీర్లో హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన సినిమాగా నిలువడం ఖాయమని అల్లరి నరేశ్ ధీమా వ్యక్తం చేశాడు. ఉగ్రం ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చెప్పాడు. పోలీసాఫీసర్‌గా వరుస మిస్సింగ్ కేసులను చేధించే క్రమంలో చిక్కుల్లో పడ్డ అల్లరి నరేశ్.. వాటిని ఎలా అధిగమించాడనే కథాంశంతో వస్తోంది ఉగ్రం. అల్లరి నరేశ్ డ్యూయల్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో మలయాళ భామ మిర్నా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
ఇప్పటికే విడుదలైన ఉగ్రం టీజర్, పాటలు, ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ఉగ్రం చిత్రానికి టూమ్ వెంకట్, అబ్బూరి రవి స్టోరీ, డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది తెరకెక్కిస్తుండగా.. శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందిస్తున్నాడు. అల్లరి నరేశ్ టైటిల్‌కు తగ్గట్టుగా తనలోని డ్యుయెల్ షేడ్స్‌తో ఉగ్రరూపంలో శత్రువులను చీల్చి చెండాడబోతున్నట్టు ట్రైలర్‌తో అర్థమవుతోంది.
ఉగ్రం ట్రైలర్..
చాప్టర్-1 ఇంటెన్స్ నైట్ షూట్ మేకింగ్..
చాప్టర్- 2 పవర్ ఫుల్ ఫైట్ మేకింగ్..
ఉగ్రం టీజర్..
దేవేరి వీడియో సాంగ్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నల్లగొండ ఎన్జీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
‘నేల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి’
Accident | పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం.. వెడ్డింగ్ కార్డ్స్ పంచేందుకు వెళ్తుంటే..
Nithin | ‘అలియాస్ రుక్మిణి’లో యంగ్ లుక్‌లో నితిన్.. కృష్ణగా సరికొత్త అవతారం!
‘రామవరం ప్రజలకు స్థిరాస్తి పేరు మార్పిడికి అవకాశం కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

