Allari Naresh | మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో అల్లరి నరేశ్
అల్లరి నరేశ్‌లో కామెడీ కంటే సీరియస్నే ఎక్కువ ఇష్టపడుతున్నారు ప్రేక్షకులు. నటుడిగా ఆయనకు మంచి పేరు తెచ్చిన సినిమాలన్నీ సీరియస్ రోల్సే కావడం అందుకు ఉదాహరణ.
Allari Naresh | అల్లరి నరేశ్‌లో కామెడీ కంటే సీరియస్నే ఎక్కువ ఇష్టపడుతున్నారు ప్రేక్షకులు. నటుడిగా ఆయనకు మంచి పేరు తెచ్చిన సినిమాలన్నీ సీరియస్ రోల్సే కావడం అందుకు ఉదాహరణ. త్వరలోనే ‘బచ్చల మల్లి’గా మరో సీరియస్ రోల్లో కనిపించనున్నారు అల్లరి నరేశ్. సుబ్బు మంగదేవి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మాతలు. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన ఈ సినిమా ప్రచార చిత్రాలకు మంచి స్పందన వస్తున్నదని మేకర్స్ ఆనందం వెలిబుచ్చారు.
సెప్టెంబర్‌లో సినిమా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. నరేశ్ కెరీర్లో ఇప్పటివరకూ చేయని మాస్ కేరక్టర్ ఇందులో చేస్తున్నారని, మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో నరేశ్‌ని డైరెక్టర్ సుబ్బు ప్రజెంట్ చేస్తున్నారని నిర్మాతలు తెలిపారు. అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రోహిణి, రావురమేశ్, అచ్యుత్‌కుమార్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: రిచర్డ్స్ ఎం.నాథన్, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, నిర్మాణం: హాస్య మూవీస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Proteins | మహిళలు రోజూ ఎంత మొత్తంలో ప్రోటీన్లను తీసుకోవాలి.. ఎలాంటి వ్యాయామాలు చేయాలి..?
Mushfiqur Rahim | టెస్టు క్రికెట్లో చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్..!
Garividi Lakshmi OTT | ఓటీటీలోకి వస్తున్న ‘గరివిడి లక్ష్మి’.. ఆనంది నటించిన బయోపిక్ ఎక్కడ చూడొచ్చంటే?
Perni Nani | ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు : మాజీ మంత్రి పేర్నినాని
‘తాగునీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యం’
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

