‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమా అంటే నాకు ఇష్టం. అందులో నేను చేసిన షానయా పాత్రంటే ఇంకా ఇష్టం. నా లక్కీ కేరక్టర్ అది’ అంటున్నది అందాల భామ అలియాభట్. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమా విడుదలై 11ఏళ్లు పూర్తయింది. అంటే, కథానాయికగా అలియాకు 11ఏళ్లు నిండాయన్నమాట . దాంతో ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అయ్యింది అలియా.
‘ సిద్ధార్ద్ మల్హోత్రా, వరుణ్ధావన్లకు కూడా హీరోలుగా ఇదే తొలి సినిమా. మా ముగ్గురిదీ ఒకే ఏజ్ గ్రూప్. అందుకే పిక్నిక్లా సాగిపోయింది సినిమా. కరణ్‌జోహార్ సార్‌కి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాలో షానయాని చూసింది ఆయనే కదా. కాబట్టే హీరోయిన్ని కాగలిగాను. అప్పుడలా పరిచయం అవ్వడం.. ఇప్పడిలా రాష్ట్రపతి చేతులమీదుగా జాతీయ అవార్డును అందుకోవడం.. అంతా మిరాకిల్.
దేవుడు అందరికీ ఓ మంచి దశను ఇస్తాడు. నాకు నడుస్తున్నది అలాంటి దశనే. ఈ పదకొండేళ్లలో నాకు జరిగిన అతిపెద్ద మంచి ఏంటంటే.. రణ్బీర్లాంటి అందగాడు, మంచివాడు భర్తవ్వడం.’ అంటూ ఆనందం వ్యక్తం చేసింది అలియా.