అలనాటి రామచంద్రుడు
కృష్ణవంశీ, మోక్ష జంటగా నటిస్తున్న చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకుడు. హైనివా క్రియేషన్స్ పతాకంపై హైమావతి, శ్రీరామ్ నిర్మిస్తున్నారు.
కృష్ణవంశీ, మోక్ష జంటగా నటిస్తున్న చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకుడు. హైనివా క్రియేషన్స్ పతాకంపై హైమావతి, శ్రీరామ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఆదివారం విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సున్నితమైన భావోద్వేగాలతో సాగే ప్రేమకథా చిత్రమిది. మండు వేసవిలో చిరుజల్లులా మనసుకు హాయిని పంచుతుంది. కుటుంబ అనుబంధాల గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ సాగుతుంది.
ఈ చిత్రం ద్వారా కృష్ణవంశీ అనే యువకుడిని హీరోగా పరిచయం చేస్తున్నాం’ అన్నారు. బ్రహ్మాజీ, సుధ, ప్రమోదిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ప్రేమ్‌సాగర్, సంగీతం: శశాంక్ తిరుపతి, రచన-దర్శకత్వం: చిలుకూరి ఆకాష్ రెడ్డి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

