Prithviraj | ‘మా ప్రాణాలైనా అర్పిస్తాం కాని.. మా దేశం నుంచి పిడికెడంత మట్టి కూడా మీ సుల్తాన్కివ్వం’.. ఆకట్టుకుంటున్న ‘పృథ్వీరాజ్’ ట్రైలర్
Prithviraj Trailer | బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్షయ్‌కుమార్ ఏ స్టార్ హీరోకు సాధ్యం కాని విధంగా ఏడాదికి మూడు నాలుగు సినిమాలను చేస్తుంటాడు. ప్రస్తుతం ఈయన చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి.ఇటీవలే ‘బచ్చన్‌పాండే’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళంలో సూపర్ హిట్టయిన ‘జిగార్తాండా’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కింది. మార్చి 18న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది.ప్రస్తుతం నటించిన లేటెస్ట్ చిత్రం ‘పృథ్వీరాజ్’. చంద్ర ప్రకాష్ ద్వివేడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్3న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేశారు.
‘ఉత్తరాధికారి బంధురిత్యా కాదు యోగ్యతతో ఎంచుకోబడతాడు. శౌర్యానికి, వీరత్వానికి ఇంకా న్యాయం కోసం..పృథ్వీరాజ్ చౌహన్‌కు ఢిల్లీ సింహాసనంపై పట్టాభిషేకం చేస్తున్నాం’ అంటూ అక్షయ్ పాత్రతో ట్రైలర్ ప్రారంభమువుతుంది. ‘మా ప్రాణాలైనా అర్పిస్తాం కాని.. మా దేశం నుంచి పిడికెడంత మట్టి కూడా మీ సుల్తాన్కివ్వం’ ‘ప్రేమతో చేసిన మరకని హృదయంపై కాదు, నా నుదిటిపై అద్దుకున్నాను. ఇక విధాత కూడా దీన్ని చెరపలేడు’. ‘పృథ్వీని ఎవరైనా సవాల్ చేస్తే.. నా చేతుల్తో చంపేస్తా, ఇది నా శపతం’. ‘వాల్మీకి వల్లే శ్రీరాముడున్నాడు.. చాంద్ వల్లే ఈ పృథ్వీరాజ్ చౌహన్ ఉంటాడు’ అంటూ వచ్చిన సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా నేపథ్యం సంగీతం ఆకట్టుకుంటుంది. మనుష్ నందన్ సినిమాటోగ్రహి అద్భుతంగా ఉంది. రాజపుత్ర చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని యష్‌రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. అక్షయ్ కుమార్‌కు జోడిగా మనుషి చిల్లర్ హీరోయిన్గా నటించింది. సోనూసూద్, సంజయ్ దత్ కీలకపాత్రల్లో నటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

