Ram Setu Movie | అక్షయ్‌కుమార్ ‘రామ్‌సేతు’ తెలుగు టీజర్ రిలీజ్..!
Ram Setu Telugu Teaser | బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ ప్రస్తుతం ఒక భారీ హిట్టు కోసం ఎదురు చేస్తున్నాడు. 'సూర్యవంశీ' తర్వాత ఇప్పటి వరకు ఈయనకు హిట్టు లేదు. ఈ చిత్రం తర్వాత అక్షయ్ కుమార్ ఇప్పటివరకు అరడజనుకు పైగా సినిమాలను చేశాడు.
Ram Setu Telugu Teaser | బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ ప్రస్తుతం ఒక భారీ హిట్టు కోసం ఎదురు చేస్తున్నాడు. ‘సూర్యవంశీ’ తర్వాత ఇప్పటి వరకు ఈయనకు హిట్టు లేదు. ఈ చిత్రం తర్వాత అక్షయ్ కుమార్ ఇప్పటివరకు అరడజనుకు పైగా సినిమాలను చేశాడు. అయితే అందులో ఏ ఒక్కటి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఈయన ఆశలన్ని ‘రామ్‌సేతు’ సినిమాపైనే ఉన్నాయి. అభిషేక్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ కీలకపాత్రలో నటించాడు. యాక్షన్ అడ్వేంచర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 25న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లను ప్రకటిస్తుంది. కాగా తాజాగా మేకర్స్ ఈ సినిమా తెలుగు టీజర్‌ను విడుదల చేశారు.
‘రామ్‌సేతు కాపాడుకోవడానికి మన దగ్గర ఇంకా మూడు రోజులే గడువుంది’ అంటూ ఆసక్తికరంగా టీజర్ మొదలైంది. ఆ తర్వాత వచ్చిన యాక్షన్ సీన్స్ వేరే లెవల్లో ఉన్నాయి. టీజర్లో చేసింగ్ సీన్లు, ఫైరింగ్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ‘రామ్‌సేతును చేరుకోబోతున్నాం’ అంటూ చివర్లో వచ్చిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. టీజర్‌తోనే చిత్రబృందం సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేసింది. రామ్‌సేతును కాపాడటానికి అక్షయ్‌కుమార్ ఎలాంటి సాహసాలు చేశాడు? అనే కాన్సెప్ట్‌తో చిత్రం తెరకెక్కినట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్ పురావస్తు శాఖ పరిశోదకుడిగా కనిపించనున్నాడు. అక్షయ్‌కు జోడీగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నుష్రత్ భారుచ్చా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్ పురావస్తు శాస్త్రవేత్తగా కనిపించనున్నాడు. అమెజాన్, లైకా సంస్థలతో కలిసి విక్రమ్ మల్హోత్రా, అరుణ భాటియా ఈ చిత్రాన్ని నిర్మిస్తుస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
IL-76MD | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన రికార్డు.. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ఫ్లైట్ ల్యాండింగ్
ప్రభుత్వ ధాన్యానికి ఎగనామం.. రూ.12 కోట్ల సీఎంఆర్ బియ్యం గల్లంతు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్య ట్రాన్స్ఫర్ చేస్తా అని బెదిరించారు.. వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
BRS Leaders | ప్రజా ఉద్యమాలను కేసులతో ఆపలేరు : బీఆర్ఎస్ నాయకులు
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

