బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) అభిమానులకు శుభవార్త చెప్పాడు. తన కొత్త సినిమాను గ్రాండ్గా లాంఛ్ చేశాడు. రాజ్ మెహతా (Raj Mehta) డైరెక్షన్లో చేయబోతున్న సినిమా ఇవాళ పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రానికి సెల్ఫీ (Selfiee) అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ను ఫిక్స్ చేశారు. మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్, సూరజ్ వెంజరమూడు నటించిన సూపర్ హిట్ మూవీ డ్రైవింగ్ లైసెన్స్ (Driving License) ను హిందీలో సెల్ఫీగా రీమేక్ చేస్తున్నారు.
హిందీ వెర్షన్లో అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ ఇప్పటికే సినిమా షూటింగ్కు సంబంధించిన అప్ డేట్ను అక్షయ్ అండ్ డైరెక్టర్ తో సెల్ఫీ దిగి.. ఓ వీడియోను షేర్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్, అక్షయ్ కుమార్ హోం బ్యానర్ కేప్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్, సుకుమారన్ పృథ్విరాజ్ ప్రొడక్షన్స్ , మ్యాజిక్ ఫ్రేమ్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రోహిత్ శెట్టి డైరెక్షన్లో అక్షయ్ కుమార్ నటించిన సూర్యవంశి చిత్రం గతేడాది ప్రేక్షకుల ముందుకు రాగా..కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సారి మలయాళ హిట్ ప్రాజెక్టును రీమేక్ చేస్తుండటంతో..మరి హిందీ ఏ స్థాయిలో హిట్టు కొడుతుందో చూడాలి.