Akshara Singh | బ్రేకప్ తర్వాత మళ్లీ ప్రేమలో పడ్డ అక్షరా సింగ్.. కానీ ప్రియుడి పేరు మాత్రం సీక్రెట్‌గానే..!
Akshara Singh | భోజ్‌పురి సినీ పరిశ్రమలో ఒకప్పుడు హాట్ టాపిక్‌గా నిలిచిన పవన్ సింగ్- అక్షరా సింగ్ ప్రేమకథ మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో ఈ ఇద్దరి రిలేషన్షిప్ పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బ్రేకప్ తర్వాత అక్షరా సింగ్ మళ్లీ ప్రేమలో పడినట్లు వెల్లడించడం ఆసక్తికరంగా మారింది.
Akshara Singh | భోజ్‌పురి సినీ పరిశ్రమలో ఒకప్పుడు హాట్ టాపిక్‌గా నిలిచిన పవన్ సింగ్- అక్షరా సింగ్ ప్రేమకథ మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో ఈ ఇద్దరి రిలేషన్షిప్ పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బ్రేకప్ తర్వాత అక్షరా సింగ్ మళ్లీ ప్రేమలో పడినట్లు వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడిన అక్షరా సింగ్ తన లవ్ లైఫ్ గురించి ఓపెన్ అయ్యారు. “అవును, నేను ప్రస్తుతం ప్రేమలో ఉన్నాను” అని స్పష్టంగా చెప్పారు. అయితే ఆ ప్రేమ గురించి పూర్తి వివరాలు వెల్లడించడానికి ఇంకా సమయం ఉందని పేర్కొన్నారు. “ప్రేమ అనే పదంలోని మొదటి అక్షరం వద్దనే ఉన్నాను. పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మరిన్ని విషయాలు చెబుతాను” అంటూ ఆసక్తికరంగా స్పందించారు.
గతంలో పవన్ సింగ్‌తో అక్షరా సింగ్ ప్రేమలో ఉన్నారని, ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని కూడా ప్రచారం జరిగింది. కానీ 2018లో పవన్ సింగ్ జ్యోతి సింగ్‌ను వివాహం చేసుకోవడంతో వారి బంధం ముగిసింది. అనంతరం అక్షరా సింగ్ ఆయనపై పలు ఆరోపణలు చేయడం కూడా పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పుడు మళ్లీ ప్రేమలో ఉన్నానని చెప్పినప్పటికీ, తన ప్రియుడి పేరును మాత్రం అక్షరా సింగ్ వెల్లడించలేదు. “పేరు చెప్పితే దిష్టి తగులుతుందేమో అనిపిస్తోంది” అంటూ చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం తన ప్రేమను అర్థం చేసుకునే దశలో ఉన్నానని, భవిష్యత్తులో భాగస్వామి మనస్తత్వం తనకు సరిపోతుందా లేదా అన్నది తెలుసుకున్న తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తానని ఆమె స్పష్టం చేశారు.
మొత్తానికి, గత ప్రేమ విఫలమైనా ముందుకు సాగుతూ కొత్త జీవితాన్ని ఆహ్వానిస్తున్న అక్షరా సింగ్ నిర్ణయం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి ఈ అమ్మడు తన లవ్‌కి సంబంధించిన పూర్తి విషయాలు ఎప్పుడు బయట పెడుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

