The Ghost Movie | ‘ది ఘోస్ట్’ ట్రైలర్ డేట్ వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే?
The Ghost Movie Trailer Date Announced | అక్కినేని నాగార్జున ‘బంగార్రాజు’తో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. సోగ్గాడే చిన్ని నాయన తర్వాత దాదాపు 6 ఏళ్ళకు ఈయనకు హిట్ పడింది. కొడుకు నాగచైతన్యతో కలిసి నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై ఈ ఏడాది మొదటి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కమర్షియల్‌గా ఈ చిత్రం నాగార్జునకు మంచి బూస్టప్ ఇచ్చింది. ప్రస్తుతం ఇదే జోష్‌తో ‘ది ఘోస్ట్’ చిత్రాన్ని పూర్తి చేశాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి ప్రేక్షకుల్లో మంచి బజ్ ఏర్పడింది. ఇటీవలే విడుదలైన యాక్షన్ ప్రోమోకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ డేట్‌ను ప్రకటించారు.
‘ది ఘోస్ట్’ ట్రైలర్‌ను ఆగస్టు 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేకాకుండా నాగార్జున, సోనాల్ చౌహన్ చేతిలో గన్స్ పట్టుకుని హగ్ చేసుకున్న పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో నాగార్జున ఇంటర్‌పోల్ ఆఫిసర్‌గా కనిపించనున్నాడు. నాగార్జునకు జోడీగా సోనాల్ చౌహన్ హీరోయిన్గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కురి రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు .యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకుగా అక్టోబర్ 5న విడుదల కానుంది.
In 4 days, things are about to get really intense ⚔️#TheGhost Trailer releasing on 25th August. #TheGhostonOct5@iamnagarjuna @PraveenSattaru @sonalchauhan7 @SVCLLP @nseplofficial @bharattsaurabh @SonyMusicSouth @AsianSuniel @puskurrammohan @sharrath_marar @Dharmi_edits pic.twitter.com/YNOs8eEpiu
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) August 21, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

