పంతం సాధిం చేలా.. యుద్ధం మొదలు!
అక్కినేని నాగచైతన్య ‘మనం’ లాంటి బ్లాక్‌బస్టర్ తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం ‘థ్యాంక్యూ’. దిల్‌రాజు, శిరీష్‌లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాశీఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. టీజర్‌తో అందరిలోనూ ఆసక్తిని కలిగించిన ఈ చిత్రం నుంచి ‘మారో మారో ’ అనే యూత్‌ఫుల్ కాలేజ్ సాంగ్ లిరికల్ వీడియోను శుక్రవారం విడుదల చేసింది చిత్రబృందం.
‘సై అంటే సైరా సంసిద్ధం లేరా..సంకల్పం సంధిస్తాలే పంతం సాధించేలా.. పోరాటం క్రీడ..నీ మతమైతేరా..క్రీడైనా పోరాటంలా మార్చి ఉరికిస్తారా…మారో మారో యుద్ధం మొదలు..తాడో పేడో తేల్చెయ్ ఇపుడు’ అంటూ స్ఫూర్తిని రగిలించేలా సాగిందీ గీతం. యూత్‌ఫుల్ మాస్ కాలేజ్ పాటగా చిత్రంలో వుండే ఈ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరాలు అందించగా, దీపు అండ్ ప్రదీప్ చంద్ర ఆలపించారు. విశ్వ అండ్ కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించారు. లెజండరీ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. బీవీఎస్ రవి కథను అందించారు. జూలై 8న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

