తప్పిపోయి రాలే.. వెతుక్కుంటూ వచ్చా
అఖిల్ అక్కినేని నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ లవ్‌స్టోరీ ‘లెనిన్'. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. మురళీకిశోర్ అబ్బూరి దర్శకుడు. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాతలు. జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది.
అఖిల్ అక్కినేని నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ లవ్‌స్టోరీ ‘లెనిన్’. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. మురళీకిశోర్ అబ్బూరి దర్శకుడు. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాతలు. జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది. మే 23తో అక్కినేని నాగార్జున సినీ ప్రయాణం ప్రారంభించి, ఆయన తొలి సినిమా ‘విక్రమ్’ విడుదలై 40ఏండ్లు పూర్తయిన సందర్భంగా ‘లెనిన్’ టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు.
‘మనోడు వస్తున్నాడు’ అనే డైలాగ్‌తో ‘లెనిన్’ టీజర్‌పై హైప్ పెరిగిందని మేకర్స్ చెబుతున్నారు. ‘నేను తప్పిపోయి రాలేదు మచ్చా.. మీ అందరినీ వెతుక్కుంటూ వచ్చిన..’ అని టీజర్లో చిత్తూరు యాసలో హీరో చెప్పిన డైలాగ్ ఆ పాత్రలోని ఇంటెన్సిటీని తెలియజేస్తున్నది.
స్టేజ్‌పై ఎన్టీఆర్ పౌరాణిక డైలాగ్‌లను భాగ్యశ్రీ బోర్సే చెప్పిన తీరు, అఖిల్, భాగ్యశ్రీల కెమిస్ట్రీ యువతను ఆకట్టుకునేలా ఉన్నాయి. అఖిల్ బాడీ లాంగ్వేజ్, రగ్డ్ లుక్.. టీజర్లో హైలైట్‌గా ఉన్నాయి. శివాజీ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: లియోన్ బ్రిట్టో, సంగీతం: తమన్, సమర్పణ: అన్నపూర్ణ స్టూడియోస్, నిర్మాణం: మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పీ, సితార ఎంటర్టైన్మెంట్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

