కొత్త దర్శకుడి కథకి గ్రీన్ సిగ్నల్?
యువ హీరో అక్కినేని అఖిల్ దూకుడు పెంచారు. ప్రస్తుతం మురళీకిశోర్ అబ్బూరి దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే యూవీ క్రియేషన్స్ బ్యానర్లో అనిల్ అనే కొత్త దర్శకుడితో కూడా ఓ సినిమా చేయనున్నారు అఖిల్.
యువ హీరో అక్కినేని అఖిల్ దూకుడు పెంచారు. ప్రస్తుతం మురళీకిశోర్ అబ్బూరి దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే యూవీ క్రియేషన్స్ బ్యానర్లో అనిల్ అనే కొత్త దర్శకుడితో కూడా ఓ సినిమా చేయనున్నారు అఖిల్. రీసెంట్గా మరో దర్శకుడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిల్మ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ దర్శకుడి పేరు నందు. ‘సామజవరగమన’ సినిమాకు మాటల రచయిత అయిన నందు.. ఇటీవలే తాను తయారు చేసుకున్న కథను అఖిల్‌కి వినిపించారట. నిజానికి విక్టరీ వెంకటేశ్‌తో నందు సినిమా చేయాల్సింది. ఆయన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు ముందు వెంకీకి ఓ కథ వినిపించారు. ఆయనకు కూడా కథ నచ్చింది. అయితే.. ‘సంక్రాంతి వస్తున్నాం’ బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వగానే నందు సినిమా విషయంలో వెంకటేశ్ పునరాలోచనలో పడ్డారట. దాంతో ఆ ప్రాజెక్ట్ అక్కడితో ఆగింది. అతనే ఇప్పుడు అఖిల్‌కి కథ చెప్పి ఓకే చేయించుకున్నారన్నది ఫిల్మ్‌వర్గాల సమాచారం. శ్రీనివాస చుట్టూరి ఈ సినిమాను నిర్మిస్తారట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

