Akhanda2 | ‘అఖండ రాక్స్’ వెహికల్ లాంచ్ గ్రాండ్ ఈవెంట్.. స్క్రీన్ మీద మెస్మరైజ్ చేస్తుంది – బోయపాటి
Akhanda2 | నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'అఖండ 2'పై అంచనాలను భారీగా పెంచుతూ.. సినిమాలోని హీరో ఉపయోగించే ప్రత్యేక వాహనం 'అఖండ రాక్స్' (Akhanda Roxx) లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
Akhanda2 | నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ 2’పై అంచనాలను భారీగా పెంచుతూ.. సినిమాలోని హీరో ఉపయోగించే ప్రత్యేక వాహనం ‘అఖండ రాక్స్’ (Akhanda Roxx) లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ అద్భుతమైన వాహనాన్ని XDrive అత్యాధునిక ఇంజినీరింగ్‌తో నిర్మించగా, X Studios దానికి అద్భుతమైన సినిమాటిక్ రూపాన్ని ఇచ్చింది. ఈ వాహనం పవర్, నందమూరి వారసత్వం, మాస్ ఎనర్జీకి నిదర్శనంగా నిలిచేలా రూపుదిద్దుకుంది. బాలకృష్ణ గారి శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌కు అద్దం పట్టేలా, కథనానికి అనుసంధానమైన డిజైన్‌తో దీన్ని రూపొందించారు.
ఈ గ్రాండ్ వేడుకకు దర్శకుడు బోయపాటి శ్రీనుతో పాటు, వెహికల్ డిజైనర్ అమర్, ఆయన కోర్ క్రియేటివ్ టీమ్ ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిమానులు, మీడియా కోసం ‘అఖండ 2’లోని నందమూరి బాలకృష్ణ గారికి సంబంధించిన ఇప్పటివరకు ఎక్కడా ప్రదర్శించని ప్రత్యేక సన్నివేశాన్ని ప్రదర్శించడం ఈ ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచింది.
వెహికల్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ…అఖండ 2 కోసం మేము దాదాపు పది వెహికల్స్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశాం. అందులో ఇదొకటి. డిజైనర్ అమర్ గారు అద్భుతంగా డిజైన్ చేస్తారు. రాత్రి పగలు కష్టపడి ఈ వెహికల్‌ను గొప్పగా డిజైన్ చేసినందుకు ఆయనను అభినందించాలి. ఒక పవర్ ఉన్న క్యారెక్టర్ దిగి వస్తుంటే దానికి తగ్గ ఆబ్జెక్ట్ ఉండాలి. క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో ఈ వెహికల్ కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ వెహికల్‌ను యాక్షన్‌లో ఎంత అద్భుతంగా వాడుకున్నామో అది మీరు థియేటర్స్‌లో చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు చాలా గర్వంగా (Proud) ఫీల్ అవుతారు. మేము కోరుకున్నట్టుగా తక్కువ రోజుల్లోనే అద్భుతంగా డిజైన్ చేసి ఇచ్చిన అమర్‌కి ధన్యవాదాలు. ‘అఖండ 2’ డిసెంబర్ 5న విడుదలవుతుంది. అభిమానులందరూ చాలా ఆనందంగా ఫీల్ అయ్యే సినిమా ఇది. ఈ సినిమా భారతదేశ ఆత్మ. మీరు సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. అని బోయపాటి శ్రీను పేర్కొన్నారు.
వెహికల్ డిజైనర్ అమర్ మాట్లాడుతూ.. అఖండ 2 లాంటి ప్రతిష్టాత్మక సినిమాకి పని చేయడం మా అదృష్టం. డైరెక్టర్ బోయపాటి గారి విజన్ మేరకు ఈ వెహికల్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశాం. ఇందులో మీరు చూస్తున్న ఈ వెహికల్ స్క్రీన్ మీద మెస్మరైజ్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది అని తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

