‘ఆకాశ వీధుల్లో’ రాక్‌స్టార్ ప్రయాణం

గౌతమ్‌కృష్ణ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆకాశ వీధుల్లో’. డీజే మనోజ్, మణికంఠ నిర్మాతలు. పూజిత పొన్నాడ కథానాయిక. ఈ చిత్ర ట్రైలర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో దర్శకుడు గోపీచంద్ మలినేని విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ట్రైలర్ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. దర్శకుడిగా, హీరోగా రెండు బాధ్యతల్ని గౌతమ్ సమర్థవంతంగా నిర్వర్తించాడు’ అని తెలిపారు. ‘జీవితంలో ఓడిపోయిన ఓ యువకుడి కథ ఇది. రాక్‌స్టార్‌గా తన ప్రతిభను నిరూపించుకునే క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లేమిటన్నది ఆసక్తికరంగా ఉంటుంది. అందరికీ నచ్చుతుందనే నమ్మకముంది’ అని గౌతమ్‌కృష్ణ అన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే మంచి సినిమాగా నిలుస్తుందని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

