యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న చిల్లా చిల్లా సాంగ్.. తునివు ఫస్ట్ సింగిల్ రిలీజ్..!
ఎప్పుడెప్పుడా అని అజిత్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న తునివు అప్డేట్లు స్టార్ట్ అయ్యాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమాలోని చిల్లా చిల్లా అంటూ సాగే మాస్ బీట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
Thunivu Movie First Single | తమిళ స్టార్ అజిత్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘వాలి’, ‘ప్రియురాలు పిలిచింది’, ‘గ్యాంబ్లర్’ వంటి సినిమాలతో తెలుగులో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్నాడు. ఈయన నటించిన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతుంటాయి. ఈ ఏడాది ‘వలిమై’తో మంచి విజయం సాధించిన అజిత్.. ప్రస్తుతం అదే జోష్‌తో ‘తునివు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమౌవుతున్నాడు. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన పోస్టర్లకు విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఇటీవలే చిత్రబృందం తెలిపింది. రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ అప్డేట్లను స్టార్ట్ చేశారు.
ఈ చిత్రంలోని ‘చిల్లా చిల్లా’ సాంగ్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. లేటెస్ట్గా విడుదలైన ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. జిబ్రాన్ కంపోజింగ్, అనిరుధ్ గాత్రం ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తుంది. ఒక్క పాటతో చిత్ర యూనిట్ సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ చేశారు. ఇప్పటివరకు ఈ సాంగ్ 82లక్షల వ్యూస్ సాధించింది. ఇక యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అజిత్ నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన అజిత్ లుక్స్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది. త్వరలోనే చిత్రబృందం తెలుగు డబ్బింగ్ పనులు స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది. తెలుగులో ఈ మూవీ ‘తెగింపు’ పేరుతో రిలీజ్ కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

