Ajith kumar Wife | ఆస్పత్రిలో భార్య.. షూటింగ్ మధ్యలోనే వచ్చేసిన తమిళ హీరో అజిత్
Ajith kumar Wife | కోలీవుడ్ స్టార్ నటుడు అజిత్ కుమార్ భార్య నటి షాలిని ఆస్పత్రిలో చేరింది. అనారోగ్యం కారణంగా షాలినికి మంగళవారం చెన్నైలో చిన్న సర్జరీ జరిగింది. ప్రస్తుతం కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే షాలినికి సర్జరీ అయిన విషయం తెలుసుకున్న తన భర్త అజిత్ అజర్బైజాన్ నుంచి హుటాహుటిన చెన్నైకు వచ్చాడు.
Ajith kumar Wife | కోలీవుడ్ స్టార్ నటుడు అజిత్ కుమార్ భార్య నటి షాలిని ఆస్పత్రిలో చేరింది. అనారోగ్యం కారణంగా షాలినికి మంగళవారం చెన్నైలో చిన్న సర్జరీ జరిగింది. ప్రస్తుతం కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే షాలినికి సర్జరీ అయిన విషయం తెలుసుకున్న తన భర్త అజిత్ అజర్బైజాన్ నుంచి హుటాహుటిన చెన్నైకు వచ్చాడు. ఇక ఆస్పత్రిలో అజిత్‌తో దిగిన ఫొటోను షాలిని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.. లవ్ యూ ఫరెవర్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
అజిత్ కుమార్ (Ajithkumar) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘విడాముయర్చి’ (Vidaa Muyarchi). ఏకే 62గా వస్తున్న ఈ సినిమాకు మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తుండగా.. త్రిష (Trisha) కథానాయికగా నటిస్తుంది. ఎంత వాడు గాని (Yennai Arindhal) తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా రానుండటంతో మూవీ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ప్రస్తుతం అజర్బైజాన్లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇక షాలిని ఆస్పత్రిలో ఉండటంతో కొన్ని రోజులు అజిత్ షూటింగ్‌కు విరామం ఇవ్వనున్నట్లు సమాచారం.
కోలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, రెజీనా కసాండ్రా, అరవ్ కిజర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాబోతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ (Sanjaydutt) విలన్‌గా నటిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

