Valimai Trailer | తమిళ్ స్టార్ హీరో అజిత్ హీరోగా నటించిన వలిమై తెలుగు ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. ఈ సినిమాలో తెలుగు యంగ్ హీరో కార్తికేయ విలన్గా నటించాడు. ఫుల్ టు ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీ రూపుదిద్దుకుంది. ఈ సినిమా ట్రైలర్ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు విడుదల చేశారు.
సీబీసీఐడీ ఆఫీసర్గా అజిత్ నటించగా.. పోలీసులకు దొరకకుండా తప్పించుకుతిరుగుతున్న వ్యక్తిగా కార్తికేయ నటించాడు. ఈ సినిమాను తమిళం, తెలుగుతో పాటు.. కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. జీ స్టూడియోస్ సంస్థతో కలిసి బోనీ కపూర్ ఈ సినిమాను నిర్మించారు. ఫిబ్రవరి 24న నాలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఈ సినిమాలో బాలీవుడ్ నటి హ్యుమా ఖురేషి ముఖ్య పాత్రలో నటించింది. వినోద్ దర్శకత్వం వహించగా.. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించారు.