ఇక్కడ పవన్ కళ్యాణ్.. అక్కడ అజిత్.. ఆ ఒక్కటీ త్యాగం..
Bheemla nayak | తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే తమిళంలో అజిత్ కూడా అంతే. ఓపెనింగ్స్ తీసుకురావడంలో సౌతిండియాలో వీళ్లను మించిన హీరోలు మరొకరు లేరు. సినిమా ఎలా ఉన్నా తొలి మూడు రోజుల్లో రికార్డు ఓపెనింగ్ గ్యారెంటీ. అందుకే ఈ ఇద్దరు హీరోల సినిమాలు వచ్చినప్పుడు బాక్సాఫీస్ బద్దలు అయిపోతుంది. యాదృచ్ఛికంగా అజిత్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ వరుస రోజుల్లో ఇప్పుడు బాక్సాఫీసుపై దాడి చేశారు. వలిమై అంటూ తమిళంలో అజిత్.. భీమ్లా నాయక్ అంటూ తెలుగులో పవన్ కళ్యాణ్ ఒకేసారి దండయాత్రకు వచ్చారు. ఈ రెండు సినిమాలకు అదిరిపోయే ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇద్దరూ ఒకేసారి ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నారు.
ఎన్నో సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్న అజిత్, పవన్ కళ్యాణ్ లను అభిమానులు ముద్దుగా తల, పవర్‌స్టార్ అని పిలుచుకుంటున్నారు. కానీ ఇకపై తమను అలా పిలవద్దు అంటూ ఎంతో హుందాగా హీరోలు ఇద్దరు నిర్ణయం తీసుకున్నారు. తనను కేవలం పేరు పెట్టి పిలవండి లేదంటే ఏకే అని పిలవమని ఇటీవల ఫ్యాన్స్‌ను కోరాడు అజిత్ కుమార్. ఈ మేరకు ఒక లెటర్ కూడా విడుదల చేశాడు. పవర్ లేనోడు పవర్ స్టార్ ఏంటి ఇకపై నన్ను అలా పిలవద్దు అని పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు. ఇలా ఈ ఇద్దరు హీరోలు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఇంప్లిమెంట్ కూడా అయ్యాయి. తాజాగా వీరిద్దరి సినిమాల్లో పేర్ల ముందు ఎలాంటి బిరుదులు లేవు. వలిమై సినిమా టైటిల్స్‌లో అజిత్ కుమార్ అని మాత్రమే పడింది. ఏకే పేరు ముందు తల అని లేదు. ఇక భీమ్లా నాయక్ సినిమాకు కూడా అంతే. కేవలం పవన్ కళ్యాణ్ అని మాత్రమే టైటిల్ ఉంది. అంటే రాబోయే సినిమాల్లో కూడా కేవలం పవన్ కళ్యాణ్ అని మాత్రమే ఉంటుంది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ( PSPK ) అని ఉండదు. ఏదేమైనా ఈ ఇద్దరు హీరోలు తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

