Maidaan Trailer | ఎట్టకేలకు విడుదలైన అజయ్ దేవగణ్ ‘మైదాన్’ ట్రైలర్
Maidaan Trailer | బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మైదాన్. ఇండియన్ లెజెండరీ ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ రహీమ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాకు అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కరోనా కంటే ముందే స్టార్ట్ అయిన విషయం తెలిసిందే.
Maidaan Trailer | బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మైదాన్. ఇండియన్ లెజెండరీ ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ రహీమ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాకు అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కరోనా కంటే ముందే స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. అనుకోని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఇక చాలా రోజుల తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా విడుదల తేదీ వచ్చింది. రంజాన్ కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మైదాన్ ట్రైలర్‌ను విడుదల చేసింది.
ఇక ఈ ట్రైలర్ గమనిస్తే.. 1950-62 మధ్యకాలంలో ఫుట్‌బాల్ ఆటకు ఇండియాలో విపరీతమైన క్రేజ్ ఉండేది. అయితే ఫుట్‌బాల్ ఆటకు ఇంత ఆదరణ రావడానికి కారణం ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ రహీమ్(Abdul Raheem). అబ్దుల్ రహీమ్ కోచ్‌గా ఉన్నప్పుడే 1951, 1962లో భారత ఫుట్ బాల్ టీమ్ ఆసియా గేమ్స్ లో విజయం సాధించింది. ఇక అబ్దుల్ రహీమ్ కోచ్‌గా ఉన్నప్పుడు జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానున్నట్లు తెలుస్తుంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాలో ప్రియమణి, గజ్రాజ్ రావ్. రుద్రానిల్ ఘోష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీ స్టూడియోస్ సంస్థ, బోనికపూర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

