Mangalavaram Movie | మంగళవారం మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్.. బోల్డ్ లుక్‌లో పాయల్ రాజ్‌పుత్
Mangalavaram Movie First Look Poster | ఐదేళ్ల క్రితం వచ్చిన 'ఆర్ఎక్స్100' ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టింది. ఎన్నో ఏళ్లుగా గుర్తింపు కోసం ఎదురు చూస్తున్న కార్తికేయకు విపరీతమైన పాపులారిటీ తెచ్చిపెట్టింది.
Mangalavaram Movie First Look Poster | ఐదేళ్ల క్రితం వచ్చిన ‘ఆర్ఎక్స్100’ ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టింది. ఎన్నో ఏళ్లుగా గుర్తింపు కోసం ఎదురు చూస్తున్న కార్తికేయకు విపరీతమైన పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఇక పాయల్ రాజ్‌పుత్ బోల్డ్ నటనతో యూత్‌లో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకుంది. ఈ సినిమా కర్త, కర్మ, క్రియ అయిన అజయ్ భూపతి ఒక్క సారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు. పల్లెటూరి నేపథ్యంలో ఒక రా, రస్టిక్ లవ్‌స్టోరీతో నిర్మాతలకు పదింతలు లాభం తెచ్చిపెట్టాడు. ఈ సినిమా తర్వాత సిద్ధార్థ్, శర్వానంద్‌తో తెరకెక్కించిన మల్టిస్టారర్ ‘మహాసముద్రం’ తొలిరోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది.
ఇక ఇప్పుడు మళ్లీ అజయ్ తనకు హిట్టిచ్చిన బోల్డ్ జానర్లోనే మంగళవారం అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ప్రీ లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమాలోని హీరోయిన్ పోస్టర్‌ను రివీల్ చేశారు. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ శైలజ అనే పాత్రలో నటిస్తుంది. ఈ మేరకు మేకర్స్ ఓ బోల్డ్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. హాప్ నేకుడ్గా ఉన్న పాయల్ రాజ్‌పుత్ పోస్టర్ సినిమాపై ఒక్క సారిగా అంచనాలు పెంచింది. అంతేకాకుండా పాయల్ కంట్లో నుంచి నీళ్లు రావడం కూడా పోస్టర్లో చూపించారు. దాంతో ఈ సినిమా కేవలం బోల్డ్ కంటెంట్‌తోనే కాకుండా ప్రేక్షకులకు సరికొత్త కథను చూపించబోతున్నట్లు తెలుస్తుంది.
గ్రామీణ నేపథ్యంలో 1990లో జరిగే కథ ఇదిని తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పటివరకు ఇలాంటి కాన్సెప్ట్‌తో ఇండియాలో సినిమా రాలేదని అజయ్ భూపతి తాజాగా వెల్లడించాడు. సినిమాలో ముప్పై పాత్రలున్నాయని, ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుందని తెలిపాడు. షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమాను ఈ ఏడాది ద్వితియార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

