Raj Tarun – Lavanya | టాలీవుడ్ కథానాయకుడు రాజ్ తరుణ్ – తన మాజీ ప్రేయసి లావణ్యల గొడవ హైదరాబాద్‌లో సరిపోలే అన్నట్లు ముంబై వరకు వెళ్ళింది. ముంబైలోని ఒక ప్రైవేట్ హోటల్లో రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వీ మల్హోత్రా కలిసి ఉంటున్నారనే విషయాన్ని తెలుసుకున్న లావణ్య నేరుగా ఆ రూమ్‌లోకి వెళ్లి వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఇక మాల్వీ మల్హోత్రా కలిసి రాజ్ తరుణ్ ఉన్న వీడియోని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది లావణ్య. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకుముందు లావణ్య రూమ్‌లోకి ఎంటర్ అవ్వగానే ఆమెని చూసిన మాల్వీ మల్హోత్రా ఒక్కసారిగా షాక్ కి గురైంది, రాజ్ తరుణ్ కూడా కాస్త టెన్షన్ కి గురయ్యాడు. ఆ తర్వాత లావణ్య మాల్వీ ని అడ్డమైన బూతులు తిడుతూ నా రాజ్ ని వదిలేయ్, మాది 12 ఏళ్ళ రిలేషన్ షిప్ అంటూ మాల్వీ మల్హోత్రా ని కొట్టే ప్రయత్నం చేసింది. అయితే ఈ విషయంపై ముంబై పోలీసులను రాజ్ తరుణ్ సంప్రదించగా.. ఈ విషయాన్ని మీరే పరిష్కరించుకోండని పోలీసులు చెప్పినట్లు తెలుస్తుంది.
మరోవైపు లావణ్య కేసులో రాజ్ తరుణ్‌పై తాజాగా ఛార్జ్‌షీట్ దాఖలు అయింది. రాజ్ తరుణ్ తనని మోసం చేశాడంటూ అతని ప్రేయసి లావణ్య (lavanya) పోలీసులకు కంప్లయింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి కొత్త మలుపు తీసుకుంది. దీనిపై విచారణ జరుపుతున్న పోలీసులు రాజ్‌తరుణ్‌ను నిందితుడిగా చేర్చి, ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. రాజ్ తరుణ్ – లావణ్య కలిసి పదేళ్లు ఒకే ఇంట్లో ఉన్నారని.. లావణ్య చెబుతున్న ఆరోపణల్లో నిజం ఉన్నట్లు దానికి సంబంధించి ఆమె ఇంటి వద్ద సాక్ష్యాలు కూడా సేకరించామని పోలీసులు తమ ప్రాథమిక విచారణలో తెలిపారు. ఈ కేసు విషయంలో లావణ్య చెప్తున్నదాంట్లో వాస్తవాలు ఉన్నాయని నార్సింగి పోలీసులు నిర్ధారించారు.
రాజ్ తరుణ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న లావణ్య
ముంబైలో ఒకే ఇంట్లో రాజ్ తరుణ్- మాల్వీ మల్హోత్రాని
అర్థరాత్రి ముంబై పోలీసులకు లావణ్య ఫిర్యాదు#RajTarunLavanyaCase #Rajtarun #Lavanya #Mokshagna #MaheshBabu𓃵 #RamCharan #AlluArjun𓃵 #Prabhas #JrNTR pic.twitter.com/OD44DBy6M1
— Telugu Galaxy (@Telugu_Galaxy) September 7, 2024
ముంబై పోలీస్ స్టేషన్ కు చేరిన ట్రై యాంగిల్ స్టొరీ..
రాజ్ తరుణ్- మాల్వీ మల్హోత్రాని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న లావణ్య
రాజ్ తరుణ్- మాల్వీ సంబంధంపై ముంబై పోలీసులకు లావణ్య ఫిర్యాదు
మీరే పరిష్కరించుకోండని చెప్పిన పోలీసులు pic.twitter.com/9cqFDm5URk
— Journalist Ashok Kumar Potta (@reporterpotta) September 7, 2024