Aishwarya Rajinikanth | మా నాన్న ‘సంఘీ’ కాదన్నా ఐశ్వర్య.. కన్నీళ్లు పెట్టుకున్న రజనీకాంత్
Lal Salaam | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్ట్ చేస్తున్న లాల్‌సలామ్ (Lal Salaam). విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 09న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Lal Salaam | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్ట్ చేస్తున్న లాల్‌సలామ్ (Lal Salaam). విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 09న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఐశ్వర్య రజినీకాంత్ ప్రమోషన్స్ వేగం పెంచింది. రిపబ్లిక్ డే కానుకగా ఈ సినిమా ఆడియో లాంఛ్ ఈవెంట్ చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. అయితే ఈ ఈవెంట్లో ఐశ్వర్య మాట్లాడుతూ.. రజినీకాంత్ (Rajinikanth)పై వస్తున్న ట్రోల్స్‌పై తాజాగా స్పందించింది.
సోషల్‌మీడియాలో మా నాన్న(రజినీకాంత్) ‘సంఘీ’ అంటూ కామెంట్స్ వస్తున్నాయి. నిజానికి సోషల్‌మీడియాకు నేను చాలా దూరంగా ఉంటా.. ఆన్లైన్ నెగెటివిటీ గురించి నా టీమ్ తరచూ చెబుతుంటుంది. అలాగే నాన్నగారిపై వస్తున్న నెగటివిటీ గురించి కూడా నా టీమ్ ద్వారా తెలుసుకున్నాను. మేమూ మనుషులమే. మాకూ భావోద్వేగాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో నా తండ్రిని ‘సంఘీ’(హిందుత్వ ఐడియాలజీని ఫాలో అయ్యేవారు) అంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే ‘సంఘీ’ అంటే మొదట్లో నాకు కూడా తెలిదు. కానీ తర్వాత దానికి అర్థం తెలుసుకున్నా. ఒక రాజకీయ పార్టీ(బీజేపీ)కి మద్దతు ఇచ్చేవారిని ‘సంఘీ’ అని పిలుస్తారని తర్వాత తెలుసుకున్నాను. రజనీకాంత్ సంఘీ కాదు. నాన్న అలాంటి వారే అయితే లాల్ సలామ్ చిత్రంలో మొయినుద్దీన్ భాయ్ పాత్రలో నటించే వారే కాదు. దయచేసి ఇలాంటివి ఆపండి అంటూ ఐశ్వర్య చెప్పింది. అయితే కూతురు మాటలు విన్న రజనీకాంత్ అక్కడే కన్నీళ్లు పెట్టుకున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dakshinamukhi anjaneya swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

