న్యూఢిల్లీ: ఐశ్వర్యరాయ్ మళ్లీ తళుక్కుమన్నది. 47 ఏళ్ల బాలీవుడ్ స్టార్ .. ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో మెరిసిపోయింది. ర్యాంప్‌వాక్‌లో పాల్గొన్న ఐశ్వర్య.. వైట్ డ్రెస్సులో ఆహుతుల్ని అట్రాక్ట్ చేసింది. ఆదివారం జరిగిన ఫ్యాషన్ షోలో.. ఐశ్వర్యరాయ్ స్పెషల్‌గా కనిపించింది. లారియల్ బ్రాండ్ అంబాసిడర్ అయిన ఐశ్వర్య.. పారిస్‌లోని ఈఫిల్ టవర్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగిన ఫ్యాషన్ షోలో పాల్గొన్నది. సమ్మర్ వుమెన్వియర్ను తన క్యాట్వాక్లో ప్రజెంట్ చేసిందామె. బ్రిటీష్ స్టార్ హెలెన్ మిర్రెన్తో చేతులు కలిపి ఐశ్వర్య ర్యాంప్ వాక్‌లో జిగేల్మంది. ఫ్యాషన్ రన్‌వేపై ఐశ్వర్యతో పాటు సినీ నటి కెమిల్లా కాబెల్లో, క్యాథరీన్ లాంగ్‌ఫోర్డ్, అజా నవోమి కింగ్, అంబర్ హెర్డ్, నికోలజ్ కోస్టర్ వాల్డూ పాల్గొన్నారు.