Lal Salaam | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth ) కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రాల్లో లాల్‌సలామ్ (Lal Salaam). ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్ట్ చేస్తోంది. క్రికెట్, కమ్యూనిజం చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 9నప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో లెజెండరీ మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడని తెలిసిందే. తాజాగా లాల్ సలామ్ షూటింగ్ లొకేషన్ నుంచి ఓ వర్కింగ్ స్టిల్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ చిత్రంలో కపిల్ దేవ్ క్రికెట్ కోచ్‌గా కనిపించబోతున్నారు. ఓ వైపు కపిల్ దేవ్.. మరోవైపు రజినీకాంత్.. ఇద్దరి మధ్య ఐశ్వర్య ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్ పోస్టర్‌తోపాటు ఫస్ట్ సింగిల్ THER THIRUVIZHA సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. సంప్రదాయ ఫ్లేవర్‌లో సాగుతున్న ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది.
వివేక్ రాసిన THER THIRUVIZHA పాటను ఏఆర్ రెహమాన్ కంపోజిషన్‌లో శంకర్ మహదేవన్, ఏఆర్ రెహానా, దీప్తి సురేశ్ యోగి శంకర్ పాడాడు. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్ నిర్మిస్తున్నారు. ‘3’ మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య రజినీకాంత్. ఆ తర్వాత ‘వాయ్ రాజా వాయ్’, ‘సినిమా వీరన్’ సినిమాలు తెరకెక్కించింది.
లాంగ్ గ్యాప్ తర్వాత తండ్రీకూతుళ్ల కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో లాల్సలామ్పై అంచనాలు భారీగానే ఉన్నాయి. రజినీకాంత్ మరోవైపు జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వంలో తలైవా 170 (Thalaivar 170)లో నటిస్తుండగా.. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీంతోపాటు లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో తలైవా 171లో కూడా నటిస్తున్నాడు.
THER THIRUVIZHA లిరికల్ వీడియో సాంగ్..
‘THER THIRUVIZHA’ from Lal Salaam is here to kickstart the festive vibes! ☀️🌾✨ Let the rural beats ignite the celebration! 🥁🔥✨#TherThiruvizhaOUTNOW ▶️ https://t.co/4BN3YUHM3v
An @arrahman musical 🎶
Singers 🎤 @Shankar_Live @RaihanahShekar @deepthisings @iamyogi_se… pic.twitter.com/CRNArPqh8s— Lyca Productions (@LycaProductions) December 18, 2023
As the shoot 📽️ of #LalSalaam is completely wrapped, the team get together once again to rejoice it! 🤗✨ Off to the post-production now!#LalSalaam 🫡
🌟 @rajinikanth
🎬 @ash_rajinikanth
🎶 @arrahman
💫 @TheVishnuVishal & @vikranth_offl
🎥 @DOP_VishnuR
⚒️ @RamuThangraj… pic.twitter.com/znDsyIfuzH— Lyca Productions (@LycaProductions) August 9, 2023