హీరో సుమంత్ నటిస్తున్న సినిమా ‘అహం రీబూట్’. ఈ సినిమాలో ఆయన రేడియో జాకీ నిలయ్ పాత్రలో కనిపించనున్నారు. వాయుపుత్ర ఎంటరె్టైన్మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ పతాకాలపై రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ సాగర్ అట్లూరి రూపొందించారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్‌ను హీరో అడివి శేష్ విడుదల చేశారు. సినిమా కాన్సెప్ట్ బాగుందని ప్రశంసిస్తూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ గ్లింప్స్‌లో ఆపదలో ఉన్న అమ్మాయిలు ఆర్జే నిలయ్‌కు ఫోన్ చేస్తూ ఆయన సహాయాన్ని కోరుతారు. మరి వారిని ఆ ఆపదల నుంచి కథానాయకుడు ఎలా రక్షించాడు అనేది ఆసక్తికరంగా ఉండబోతున్నది. పోస్ట్ ప్రొడక్షన్ ముగింపు దశలో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాతలు రఘువీర్, సృజన్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం : శ్రీరామ్ మద్దూరి, సినిమాటోగ్రఫీ : వరుణ్ అంకర్ల.