Shanmukh Jaswanth | కుర్రాడు ‘ఆహా’ అనిపిస్తున్నాడు..నెక్ట్స్ ఇక సినిమాల్లోకేనా..!
యూట్యూబ్‌లో చిన్న చిన్న కామెడీ స్కిట్లు చేసుకునే స్థాయి నుంచి వెబ్ సిరీస్ చేసే స్థాయికి ఎదిగాడు షణ్ముక్ జస్వంత్ (Shanmukh Jaswanth) . బిగ్ బాస్ సీజన్ 5లోకి వచ్చి రన్నరప్ గా నిలిచాడు. పైగా మనోడికి యూ ట్యూబ్‌లో అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది.
కష్టే ఫలి అన్నారు పెద్దలు.. ఒకదాన్ని నమ్మి సిన్సియర్ గా కష్టపడితే దానికి తగ్గ ఫలితం కచ్చితంగా ఎప్పుడో ఒకసారి అందుతుంది. ఇప్పుడు షణ్ముక్ జస్వంత్ (Shanmukh Jaswanth) విషయంలోనూ ఇదే జరుగుతుంది. యూట్యూబ్‌లో చిన్న చిన్న కామెడీ స్కిట్లు చేసుకునే స్థాయి నుంచి వెబ్ సిరీస్ చేసే స్థాయికి ఎదిగాడు షణ్ముఖ్. బిగ్ బాస్ సీజన్ 5లోకి వచ్చి రన్నరప్ గా నిలిచాడు. పైగా మనోడికి యూ ట్యూబ్‌లో అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది. ఏకంగా 4 మిలియన్లకు పైగా సబ్ స్కైబర్స్ ఉన్నారు. లాక్ డౌన్ ముందు వరకు షణ్ముఖ్ జస్వంత్ ఒక సాధారణ యూ ట్యూబర్ మాత్రమే.
కానీ కరోనా సమయంలో ఈయన నటించిన సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ సంచలన విజయం సాధించింది. ఒక్కొక్క ఎపిసోడ్ కు మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దాంతో మనోడి జాతకం మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన సూర్య వెబ్ సిరీస్ కూడా అంతకంటే అద్భుతమైన ఆదరణ దక్కించుకుంది. ఈ రెండు వెబ్ సిరీస్ లను సుబ్బు డైరెక్ట్ చేశాడు. తాజాగా ఈ కాంబినేషన్లో మరో వెబ్ సిరీస్ వస్తుంది. అయితే ఈసారి యూట్యూబ్ లో ఫ్రీ కాకుండా ఆహా ఓటీటీ (Aha OTT)కి ఇచ్చేశారు.
వీళ్ళు చెప్పిన కాన్సెప్ట్ నచ్చి ఆహా దీనికి సపోర్టుగా నిలిచింది. పైగా అల్లు అరవింద్ ( Allu Aravind)కి కూడా ఇద్దరూ చెప్పిన కథ బాగా నచ్చిందని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ కానీ బాగా వచ్చిందంటే కచ్చితంగా సినిమా ఆఫర్ గీత ఆర్ట్స్ లో రావడం లాంచడమే అంటున్నారు ఆహా యూనిట్. ఏజెంట్ ఆనంద్ సంతోష్ (Agent Anand Santosh) పేరుతో వస్తున్న ఈ వెబ్ సిరీస్ ను అరుణ్ పవర్ తెరకెక్కిస్తున్నాడు. సుబ్బు కథ అందించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ త్వరలోనే ఆహాలో ప్రసారం కానుంది.
చంటబ్బాయికి వారసుడు.. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయకు తమ్ముడు అంటూ ఈ వెబ్ సిరీస్ ను ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ చూస్తుంటే అంచనాలు కూడా పెరిగిపోతున్నాయి. ఏజెంట్ ఆనంద్ సంతోష్ విడుదలైన తర్వాత కచ్చితంగా షణ్ముఖ్ జస్వంత్ సినిమాల్లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఏదేమైనా ఒక సాధారణ యూ ట్యూబర్ గా కెరీర్ మొదలుపెట్టి ఈరోజు ఇంత మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ కుర్రాన్ని చూసి అతడి సబ్ స్కైబర్స్ గర్వంగా ఫీల్ అవుతున్నారు.
Chantabbayi ki varasudu, Athreya ki thammudu. Parihasam lo kaani, parishkaram lo kaani, ekkada thaggede le. #AASFirstLook#AASOnAHA @shannu__7 @infinitummediaa pic.twitter.com/snYLkNPfGo
— ahavideoin (@ahavideoIN) July 3, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్లంబర్ విమానాన్ని దించగలడా?
కశ్మీర్ బస్సులపై రెండ్రోజుల్లో రెండు దాడులు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

