Agent Movie | ఎట్టకేలకు ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న ఏజెంట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Agent Movie On Ott | థియేటరల్లో రేపొస్తుంది మాపోస్తుంది అనుకున్న సినిమాలు విడుదల వాయిదా పడటం సర్వ సాధారణమే. రిలీజ్ కు వారం రోజులుందనగా పోస్ట్ పోన్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఓటీటీలో అనౌన్స్ చేసిన సినిమాలు పోస్ట్ పోన్ అవడం చాలా అరుదుగా చూస్తుంటాం.
Agent Movie On Ott | థియేటరల్లో రేపొస్తుంది మాపోస్తుంది అనుకున్న సినిమాలు విడుదల వాయిదా పడటం సర్వ సాధారణమే. రిలీజ్ కు వారం రోజులుందనగా పోస్ట్ పోన్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఓటీటీలో అనౌన్స్ చేసిన సినిమాలు పోస్ట్ పోన్ అవడం చాలా అరుదుగా చూస్తుంటాం. అలాంటి చోద్యమే ఏజెంట్ సినిమాకు చూశాం. ఈ సినిమాను ముందుగా మే 19న స్ట్రీమింగ్ చేస్తున్నట్లు సోని లైవ్ అధికారికంగా ప్రకటించింది. తీరా చూస్తే స్ట్రీమింగ్ చేయలేదు. దానికి బోలెడన్ని కారణాలు వినిపించాయి. మేకర్స్ మరోసారి సినిమాకు కత్తెర పని చెప్పినట్లు గుసగుసలు వినిపించాయి. చేతులు కాలాకా ఆకులు పట్టుకుంటే ఏం లాభం అన్నట్లు అనిపిస్తుంది ఈ వ్యవహారం చూస్తుంటే. ఎలాగూ ఫ్లాప్ సినిమానే. టాక్ కూడా నెగెటీవ్‌గా వచ్చింది. అలాంటప్పుడు ఒరిజినల్ వెర్షన్‌ను రిలీజ్ చేస్తే సరిపోతుందిగా.. మళ్లీ ఎడిటింగ్ ఎందుకంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేశారు.
ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్ ఫిక్సయినట్లు తెలుస్తుంది. ఈ సినిమాను జూన్ 23న స్ట్రీమింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక నెల రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం మూటగట్టుకుంది. ‘ఏజెంట్’ ఫలితం అక్కినేని ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. దాదాపు రెండేళ్లు ఒళ్లు హూనం చేసుకున్న అఖిల్‌కు ఈ సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుందనుకుంటే.. తన కెరీర్లో ఒక మచ్చలా మిగిలిపోయింది. అసలు ఈ సినిమాను డైరెక్ట్ చేసింది ‘ధృవ’ సినిమా తీసిన సురేందర్ ఏనా అనే డౌట్ కూడా ఎంతో మందికి వచ్చింది. ఆయన ఫ్లాప్ సినిమాలకు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటిది ఈ సినిమా వైపు ప్రేక్షకులు కన్నెత్తి కూడా చూడలేదంటే ఈ సినిమా ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మమ్ముట్టి కీలకపాత్ర పోషించిన ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా సాక్షీ వైద్య నటించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

