వయసు సమస్యే కాదు
తెలుగు తెరపై మరోసారి జోరు చూపిస్తున్నది అందాల తార శృతిహాసన్. స్టార్ హీరోల సరసన వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తున్నది. ఆమె సహ నాయికలతో చూస్తే...నెమ్మదించిన ఇటీవల ఆమె కెరీర్‌తో పోలిస్తే ఇది బౌన్స్ బ్యాక్ లాంటి పరిస్థితే.
తెలుగు తెరపై మరోసారి జోరు చూపిస్తున్నది అందాల తార శృతిహాసన్. స్టార్ హీరోల సరసన వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తున్నది. ఆమె సహ నాయికలతో చూస్తే…నెమ్మదించిన ఇటీవల ఆమె కెరీర్‌తో పోలిస్తే ఇది బౌన్స్ బ్యాక్ లాంటి పరిస్థితే. ఏదో ఒక భాషలో సక్సెస్‌లో ఉండటమే శృతి ఇన్నాళ్ల సుదీర్ఘ ప్రయాణానికి కారణం. తాజాగా శృతి మాట్లాడుతూ…‘నచ్చినట్లు పని చేసుకుంటూ వెళ్లడమే నా ఇన్నేండ్ల జర్నీకి కారణం. పరిశ్రమలోకి వచ్చినప్పుడు స్టార్ హీరో కూతురిగా సెట్స్‌లో నేనెలా ప్రవర్తిస్తాను అనుకునేవారు.
నేనెప్పుడూ ఒకరి ఊహలకు, అంచనాలకు తగినట్లు లేను. నాలా నేను ఉంటూ వచ్చాను. చేసే పనిని ప్రేమించాను. సహ నటులతో స్నేహంగా ఉంటూ వచ్చాను. వయసుకు అతీతంగా వారి దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. 21 ఏండ్ల హీరోతో కలిసి నటించాను. నా కంటే పెద్ద వయసున్న నటులతోనూ కలిసి పనిచేస్తున్నాను. నా దృష్టిలో సహ నటుడి వయసు సమస్య కాదు’ అని చెప్పింది. ఆమె ప్రస్తుతం చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణతో ‘వీరసింహా రెడ్డి’, ప్రభాస్ సరసన ‘సలార్’ చిత్రాల్లో నటిస్తున్నది. నాయికగా కెరీర్ సాగిస్తూనే గాయనిగా తన ప్రతిభ చూపిస్తున్న శృతి. ఆమె తాజాగా మహిళల కోసం ప్రత్యేకంగా ‘హీరో’ అనే పాట రూపకల్పన చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- age
- colleague
- irrelevant
- omy costar
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

