న్యూఢిల్లీ: ఓటీటీలో లస్ట్ స్టోరీస్ 2 రిలీజ్ కానున్న నేపథ్యంలో బాలీవుడ్ నటి నీనా గుప్తా(Neena Gupta) ఓ పాత విషయాన్ని గుర్తు చేసింది. దిల్లగీ టీవీ షో కోసం అప్పట్లో ఓ కిస్ సీన్ చేశానని, కానీ ఆ సీన్ షూట్ చేసిన తర్వాత రాత్రంతా నిద్ర పోలేకపోయినట్లు నీనా గుప్తా తెలిపింది. కిస్ సీన్ షూట్ చేసిన తర్వాత డెటల్తో నోటిని పుకిలించినట్లు ఆమె చెప్పింది. ఇన్స్టాంట్ బాలీవుడ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని వెల్లడించింది.
ఓ నటిగా అన్ని రకాల సీన్లు చేయాల్సి ఉంటుందన్నారు. దిలీప్ ధావన్‌తో సిరీయల్ చేస్తున్న సమయంలో కిస్ సీన్ చేయాల్సి వచ్చినట్లు గుర్తు చేశారు. కిస్సింగ్ సీన్ల షూటింగ్‌తో ఇబ్బంది ఉంటుందని, అతనేమీ ఫ్రెండ్ కాదు అని, గుడ్ లుకింగ్‌గా ఉన్నా.. ఇలాంటి విషయాల్లో మానసికంగా, శారీరకంగా ముందుకు వెళ్లలేమని, కానీ పరిస్థితుల దృష్ట్యా ఆ సీన్ చేయాల్సి వచ్చినట్లు ఆమె తెలిపింది.
సీన్ ముగిసిన వెంటనే గనోటిని డెటాల్‌తో కడిగినట్లు చెప్పిందామె. కొందరు కామిడీ చేయలేరు, కొందరు కెమెరా ముందు నవ్వలేరు, అలాగే మనకు తెలియని వాళ్లను కిస్ చేయడం కష్టమైన పని అని నీనా గుప్తా తెలిపింది.