RaviTeja Multiplex | టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్‌లోకి ఎంటర్ అవుతున్నట్లు సమాచారం. అగ్ర హీరోలు మహేష్‌బాబు, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్‌ల బాటలోనే రవితేజ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. ఇందుకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రీసెంట్గా RT టీంవర్క్స్ అంటూ నిర్మాణ సంస్థను ప్రారంభించిన రవితేజ సుందరం మాస్టర్ అంటూ సినిమాను కూడా విడుదలకు సిద్దం చేశాడు. అయితే తాజాగా ఈ మాస్ హీరో ఏషియన్ సంస్థతో కలిసి ART సినిమాస్ అనే మల్టీప్లెక్స్ కట్టబోతున్నట్టు సమాచారం. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్‌లోని వెంకటాద్రి థియేటర్‌ను కూల్చి మల్టీప్లెక్స్‌గా కడుతున్నట్లు టాక్ నడుస్తుంది. ఇందులో మొత్తం ఐదు స్క్రీన్లు ఉండనున్నట్లు టాక్. ఒకవేళ ఇదే నిజమైతే దిల్సుఖ్ చుట్టుపక్కల ప్రజలకు మరో మల్టీప్లెక్స్ అందుబాటులోకి రానుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక ఈ మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్‌లోకి ఇంతకుముందు మహేష్‌బాబు, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్‌లు ఎంట్రీ ఇచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఏషియన్ సంస్థతో కలిసి Asian Mahesh Babu (AMB) మల్టీప్లెక్స్ కట్టి బాగా సక్సెస్ అయ్యారు. ఇక మహేష్ తర్వాత రౌడి హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) మహబూబ్ నగర్లో AVD సినిమాస్ (Asian Vijay Devarakonda) అనే పేరుతో మల్టీప్లెక్స్ స్థాపించి సక్సెస్ అయ్యాడు. వీరిద్దరి తరువాత అల్లు అర్జున్ (Alu Arjun)
కూడా AAA సినిమాస్ అని హైదరాబాద్ అమీర్‌పేట్‌లో మల్టీప్లెక్స్ ప్రారంభించాడు.