Thalaivar170 | 46ఏళ్ల తర్వాత ఆ ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటున్న రజినీకాంత్ సినిమా..!
Thalaivar170 | జైలర్‌తో వీర లెవల్లో కంబ్యాక్ ఇచ్చిన రజనీ.. అదే ఊపుతో తన 170వ సినిమా చేస్తున్నాడు. జై భీమ్ దర్శకుడు జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. కేరళ రాష్ట్ర రాజధాని అయిన తిరువునంతపురంలోని అగ్రీకల్చర్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఈ మధ్యే ఓ మేజర్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
Thalaivar170 | జైలర్‌తో వీర లెవల్లో కంబ్యాక్ ఇచ్చిన రజనీ.. అదే ఊపుతో తన 170వ సినిమా చేస్తున్నాడు. జై భీమ్ దర్శకుడు జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. కేరళ రాష్ట్ర రాజధాని అయిన తిరువునంతపురంలోని అగ్రీకల్చర్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఈ మధ్యే ఓ మేజర్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తమిళనాడులోని తిరునల్వేలిలో ప్రత్యేకంగా వేసిన సెట్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ ప్రాంతానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
దాదాపు 46ఏళ్ల తర్వాత రజనీకాంత్ సినిమా అక్కడ షూటింగ్ జరుగుతుంది. 1977లో ముత్తురామన్ దర్శకత్వంలో రజనీ నటించిన భువన ఒరు కెల్వి కురి సినిమా షూటింగ్ చాలా వరకు అక్కడే జరిగింద. ఆ తర్వాత ఇప్పటివరకు రజనీ సినిమా అక్కడ షూటింగ్ జరుపలేదు. అంతేకాకుండా రజనీ నటించిన ముత్తు సినిమా ఈ ప్రాంతంలో ఒకేసారి రెండు థియేటర్లలో విడుదలై.. రెండు చోట్ల వందరోజులు పూర్తి చేసుకుంది. ఇలా రజనీకి ఆ ప్రాంతం మంచి అనుభవాలను మిగిల్చింది. గత వారం రోజులు ఈ సినిమా షూటింగ్ అక్కడే జరుగుతుంది.
రజనీను చూసేందుకు వందలాది ఫ్యాన్స్ వస్తున్నారు. ఇక ఈ మధ్య కాలంలో షూటింగ్ నుంచి సినిమాపై ఓ రేంజ్లో అంచనాలు పెంచేసిన సినిమా ఏదైనా ఉందంటే అది ఈ సినిమానే. రోజుకో కాస్ట్‌ను రివీల్ చేస్తూ అంతకంతకూ సినిమాపై ఎక్సట్పెక్టేషన్స్ పెంచుకుంటూ వస్తున్నారు. అమితాబ్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, ఫాహద్ ఫాజిల్ ఇలా సౌత్‌లోని పలు ఇండస్ట్రీల నుంచి స్టార్ కాస్ట్‌ను తీసుకుని సినిమా స్కేల్‌ను పెంచారు.
ఇక జైభీమ్ తర్వాత T.G.జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ అమితాసక్తి నెలకొంది. ఈ సినిమా కూడా జై భీమ్ తరహాలోనే సోషల్ మేసేజ్‌తో ముడిపడి ఉండనుందట. అయితే దానికి రజనీ స్వాగ్‌ను కూడా యాడ్ చేసి ఊహించని రేంజ్లో సినిమాను తీయబోతున్నారట. డబ్బులను మంచి నీళ్లలా ఖర్చు పెట్టే లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తుంది. జైలర్‌తో ఊరమాస్ మ్యూజిక్ ఇచ్చిన అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు కూడా సంగీతం అందించనున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది ద్వితియార్థంలో రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

