Major | ‘మేజర్’ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫార్మ్.. స్ట్రీమింగ్ ఎప్పటినుండంటే?
Major Movie Ott Release Date Confirmed | టాలీవుడ్ యంగ్ హీరో అడివిశేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మేజర్’. శశికిరణ్ టిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలై సంచలన విజయం సాధించింది. ముంబై బాంబు దాడుల్లో అమర వీరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. మేజర్ పాత్రలో అడివి శేష్ జీవించాడు. శేష్ తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ చిత్రం భారీ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుంది. అడివి శేష్‌కు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా మేజర్ నిలిచింది. ఇప్పటికే ఈ చిత్రం నిర్మాతలకు డబుల్ ప్రాఫిట్స్ను తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్దమైంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 3 నుండి ‘మేజర్’ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. థియేటర్లో విడుదలైన 30రోజులకు డిజిటల్లో విడుదలవుతుంది. బయోగ్రాఫీకల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జీఎంబీ ఎంటర్టైనమెంట్స్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏ+ఎయస్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అడివిశేష్‌కు జోడీగా సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ప్రకాష్ రాజ్, రేవతి, శోభితా ధూళిపాల కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం అడివిశేష్ నటించిన హిట్-2 షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. గూఢాచారి-2 ప్రీ ప్రొడక్సన్ పనులలో బిజీగా ఉంది.
The untold story of a son. The untold story of a father. The untold story of a SOLDIER. 🇮🇳🪖
Major is coming to Netflix on 3rd July in Telugu, Hindi and Malayalam! #MajorOnNetflix pic.twitter.com/1ngxcOciuQ
— Netflix India South (@Netflix_INSouth) June 30, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

