Hit-2 Movie | హిట్-2 మూవీ రన్‌టైమ్ మరీ ఇంత తక్కువా?
Hit-2 Movie Censor | టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ అడివిశేష్ వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన 'హిట్-2' రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. సైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం 'హిట్' సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది.
Hit-2 Movie Censor | ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై అనూహ్య విజయం సాధించిన చిత్రాల్లో ‘హిట్’ ఒకటి. విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. దర్శకుడిగా సైలేష్కు డెబ్యూ సినిమానే అయినా.. తన టేకింగ్, విజన్‌తో ప్రేక్షకులను సినిమా లాస్ట్ వరకు సీట్లలోనే కూర్చోబెట్టాడు. ఈ చిత్రంతో ప్రొడ్యూసర్‌గా నానికి భారీ హిట్ వచ్చింది. కాగా రెండేళ్ళ తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కింది. సీక్వెల్లో అడివిశేష్ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది.
ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. కాగా ఈ సినిమా రన్‌టైం రెండు గంటలు ఉండనుంది. ఈ మధ్య కాలంలో ఇంత తక్కువ రన్‌టైంతో ఏ సినిమా రాలేదు. థ్రిల్లర్ సినిమాలకు ఈ రన్‌టైం ఉంటే చాలా వరకు ప్లస్ అవుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం హిట్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కనుంది. అడివిశేష్‌కు జోడీగా మీనాక్షీ చౌదరీ నటిస్తుంది. రావురమేష్, కోమలి ప్రసాద్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్‌పై ప్రశాంత్ తిపిరినేనితో కలిసి హీరో నాని నిర్మించాడు. ఈ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

