Aditi Prabhudeva | కన్నడ స్టార్ హీరోయిన్ అదితి ప్రభుదేవా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ వ్యాపారవేత్త యశష్ పట్లతో ఆమె వివాహం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్లో జరిగిన వీరి వివాహ వేడుకకు పలువురు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో పాటు నటులు యష్, రాధికా పండిట్, జై జగదీష్, రచన ఇందర్, అభిషేక్ అంబరీష్, మేఘనా రాజ్ సర్జా తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వివాహ వేడుకలో అదితి తెలుపు, ఎరుపు రంగు పట్టుచీరలో మెరిసిపోయారు. యశష్ పట్టు ధోతీ, చొక్కా ధరించి ఎంతో అందంగా కనిపించారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలను అదితి తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసింది. ఫొటోలు చూసిన అభిమానులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలుతపుతూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.