Adipurush | ఆదిపురుష్ టిక్కెట్‌పై బంపర్ ఆఫర్.. భారీగా తగ్గిన 3డీ వెర్షన్ ధర
Adipurush Movie | ఆదిపురుష్ రెండో వారంలోకి అడుగుపెట్టిన టైమ్‌లోనూ వివాదాలు తగ్గట్లేదు. దీనికంటే ముప్పై ఏళ్ల ముందు వచ్చిన దూరదర్శన్ రామాయణం చాలా బెటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Adipurush Movie | ఆదిపురుష్ రెండో వారంలోకి అడుగుపెట్టిన టైమ్‌లోనూ వివాదాలు తగ్గట్లేదు. దీనికంటే ముప్పై ఏళ్ల ముందు వచ్చిన దూరదర్శన్ రామాయణం చాలా బెటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కలెక్షన్ల జోరు కూడా తగ్గింది. తొలిమూడు రోజుల్లో మూడొందల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఆదిపురుష్ ఆ తర్వాత ఏడు రోజులు కనీసం వంద కోట్ల మార్క్ కూడా దాటలేకపోయింది. శని, ఆదివారాలు కూడా ఈ సినిమాకు పెద్దగా కలిసి రాలేదు. ఈ క్రమంలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు ఆదిపురుష్ బృందం గట్టి ప్రయత్నాలే చేస్తుంది. పోయినవారం రెండు రోజులు తక్కువ రేటుకే సినిమా చూసే వెసలు బాటు కల్పించింది. కాగా దానికి కాస్త మంచి స్పందనే కన్పించింది.
ఇక ఇప్పుడు అదే విధంగా పూర్తి స్థాయిలో టిక్కెట్ రేట్లు తగ్గించి సినిమాను ప్రదర్శితం చేయనున్నట్లు ప్రకటించించింది. ఇక సోమవారం నుంచి ఈ సినిమా మల్టీప్లెక్సులలో కేవలం రూ.112కే అది కూడా ౩డీలో చూసే ఆఫర్‌ను ప్రకటించింది. ఆ ఆఫర్ చివరి వరకు ఉండనుంది. అంతేకాకుండా మార్చిన డైలాగ్స్‌తో ఈ సినిమాను ప్రదర్శితం చేయనున్నట్లు తెలిపింది. ఇక సినీ లవర్స్‌కు ఇది బంపర్ ఆఫరే అని చెప్పాలి. మరీ ఆ ఆఫర్ చిత్రబృందానికి ఎంత వరకు ప్లస్ అవుతుందో చూడాలి. ఆదిపురుష్ ఇప్పటివరకు నాలుగొందల కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. మరో వంద కోట్ల రేంజ్లో కలెక్షన్లు సాధిస్తే హిట్ అనే ట్యాగ్‌ను పొందుతుంది.
రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఓంరౌత్ దర్శకత్వం వహించాడు. ప్రభాస్ రాఘవుడిగా.. కృతిసనన్ జానకిగా కనిపించారు. బాలీవుడ్ నటుడు సైఫ్ లంకేష్ పాత్ర పోషించాడు. రెట్రో ఫైల్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను తెలుగులో పీపుల్ మీడియా రిలీజ్ చేసింది.
Witness the epic saga unfold!🏹
Book your tickets starting from just Rs112/-* and experience the grandeur world of Adipurush🧡
Offer starts tomorrow! #JaiShriRam 🙏Book your tickets on: https://t.co/0gHImE23yj#Adipurush now in cinemas near you ✨#Prabhas @omraut… pic.twitter.com/cQOKqn0I4S
— T-Series (@TSeries) June 25, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

