ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. పాయల్ రాజ్‌పుత్ నాయిక. కళ్యాణ్.జి.గోగణ దర్శకత్వంలో నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ఫస్ట్‌సింగిల్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ‘పాప ఆగవే’ అంటూ సాగే ఈ ఫస్ట్‌సింగిల్ పాటకు మంచి స్పందన వచ్చిందని చెబుతుంది చిత్రబృందం. దర్శకుడు మాట్లాడుతూ ‘ఆది కెరీర్లోనే పూర్తి స్థాయి హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. స్టూడెంట్, రౌడీ, పోలీస్‌గా మూడు వేరియేషన్స్ వున్న పాత్రల్లో ఆది సాయికుమార్ ఈ చిత్రంలో కనిపిస్తాడు’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్.