అదిరే అభి, వాణి, తల్లాడ సాయికృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వైట్‌పేపర్’. శివ దర్శకుడు. గ్రంధి శివప్రసాద్ నిర్మాత. ఈ చిత్ర టీజర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో సినీనటి, ఏపీ ఎమ్మెల్యే రోజా విడుదలచేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ‘ప్రస్తుత పరిస్థితుల్లో ఒక పాటను చిత్రీకరించడానికే ఐదు రోజులు పడుతుంది. కానీ అభి టీమ్ మాత్రం పది గంటల్లోనే సినిమా షూటింగ్‌ను పూర్తిచేసి రికార్డ్ సృష్టించారు. యూనిట్ సమిష్టి కృషి వల్లే ఇది సాధ్యమైంది’ అని చెప్పింది. ‘చాలెంజింగ్‌గా భావించి చేసిన సినిమా ఇది. ఒకే లొకేషన్లో ప్రయోగాత్మకంగా ఉంటుంది. హాలీవుడ్లో వచ్చిన ఫోన్‌బూత్, 7500 సినిమాల తరహాలో నవ్యానుభూతిని పంచుతుంది’ అని అదిరే అభి అన్నారు. పోలీస్ సాగించే పరిశోధన నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నామని దర్శకుడు చెప్పారు.