The Kerala Story Movie | ఉత్కంఠ భరితంగా ది కేరళ స్టోరీ ట్రైలర్.. ఆదా శర్మకు ఇదేదో బ్రేక్ ఇచ్చేలా కనిపిస్తుందే..!
The Kerala Story Trailer | తొమ్మిదేళ్ల క్రితం వచ్చిన 'హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచమైంది ముంబై బ్యూటీ ఆదా శర్మ. కమర్షియల్‌గా ఈ సినిమా భారీ విజయమే సాధించినా.. ఆదాకు మాత్రం తెలుగులో అంతగా అవకాశాలు రాలేవు. ఆ తర్వాత రెండు, మూడు బ్లాక్‌బస్టర్ సినిమాలు చేసిన అందులో ఆదా సెకండ్ హీరోయిన్గా కనిపించింది.
The Kerala Story Trailer | తొమ్మిదేళ్ల క్రితం వచ్చిన ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచమైంది ముంబై బ్యూటీ ఆదా శర్మ. కమర్షియల్‌గా ఈ సినిమా భారీ విజయమే సాధించినా.. ఆదాకు మాత్రం తెలుగులో అంతగా అవకాశాలు రాలేవు. ఆ తర్వాత రెండు, మూడు బ్లాక్‌బస్టర్ సినిమాలు చేసిన అందులో ఆదా సెకండ్ హీరోయిన్గా కనిపించింది. ఇక నాలుగేళ్లుగా ఈ అమ్మడు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కాగా ఈ ఏడాది రిలీజైన ‘సెల్ఫీ’లో ఒక చిన్న పాత్రలో మెరిసింది. కాగా ప్రస్తుతం ఆమె ఫుల్ లెంగ్త్ రోల్ పోషించిన ‘ది కేరళ స్టోరీ’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. సుదీప్తో సేన్ దర్వకత్వం వహిస్తున్న ఈ సినిమా నిజజీవితం సంఘటనల ఆధారంగా తెరకెక్కింది.
ఇప్పటికే రిలీజైన టీజర్‌కు పలు విమర్శలు రాగా.. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. లేటెస్ట్గా రిలీజైన ట్రైలర్ సినిమాపై ఎక్కడలేని క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. కేరళకు చెందిన షాలిని ఉన్నీకృష్ణన్ అనే హిందూ యువతి ముస్లిం అమ్మాయిలా ఎలా మారింది? ఉగ్రవాది సంస్థ అయిన ఐసిస్‌లో షాలినినీ చేరేలా ఎవరు ట్రాప్ చేశారు? అనే అంశాల నేపథ్యంలో సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్లో చూపించారు. ‘నేను ఎప్పుడు ఐసిస్‌లో చేరానో తెలుసుకోవడం కంటే.. ఎందుకు, ఎలా ఐసిస్‌లో చేరానో తెలియడం ముఖ్యం’. ‘కేరళలో సాధారణ అమ్మాయిలను ఉగ్రవాదులుగా మార్చే ప్రమాదకరమైన గేమ్ జరుగుతుంది’. అది కూడా అందరి కళ్ల ముందే అంటూ ఆదా చెప్పిన డైలాగ్స్ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ట్రైలర్‌తోనే సినిమాపై ఎక్కడలేని అంచనాలు నమోదయ్యాయి. చాలా కాలం తర్వాత ఆదాశర్మకు మంచి స్కోప్ ఉన్న సినిమా పడిందని ట్రైలర్‌తో స్పష్టమైంది. ఈ సినిమాకు మంచి టాక్ వస్తే మాత్రం ది కాశ్మీర్ ఫైల్స్ రేంజ్లో హిట్టవడం ఖాయం అని అనిపిస్తుంది. వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మే 5న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

