Adah Sharma | వాటి గురంచి నేను పట్టించుకోను.. అలాచేస్తే పాత్రపై దృష్టి పెట్టలేం: ఆదా శర్మ
‘ది కేరళ స్టోరీ’ కాంబినేషన్ రిపీట్ చేస్తూ దర్శకనిర్మాతలు సుదీప్తోసేన్, విపుల్ అమృత్లాల్ షా తెరకెక్కించిన చిత్రం ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’. ఆదా శర్మ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. తాజాగా ఈ పరాజయం గురించి ఆదా శర్మ మాట్లాడింది.
Adah Sharma | ‘ది కేరళ స్టోరీ’ కాంబినేషన్ రిపీట్ చేస్తూ దర్శకనిర్మాతలు సుదీప్తోసేన్, విపుల్ అమృత్లాల్ షా తెరకెక్కించిన చిత్రం ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’. ఆదా శర్మ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. తాజాగా ఈ పరాజయం గురించి ఆదా శర్మ మాట్లాడింది. ‘హిట్ సినిమాలో నటించడం కంటే మంచి సినిమాలో నటించడాన్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తా. నా పాత్రకు వందశాతం న్యాయం చేశానా, లేదా అనేది మాత్రమే ఆలోచిస్తా.
ఒక సినిమా హిట్ అవ్వడానికి. ఫ్లాప్ అవ్వడానికి రకరకాల కారణాలుంటాయి. వాటి గురంచి నేను పట్టించుకోను. నా సినిమా ఎంత వసూలు చేసింది, అనే విషయాన్ని కూడా నేను పట్టించుకోను. నంబర్ల గురించి ఆలోచిస్తే పాత్రపై దృష్టి పెట్టలేం. ‘ది కేరళ స్టోరీ’ చేస్తున్నప్పుడు అది ఇంత హిట్ అవుతుందని ఊహించి నేను చేయలేదు. కానీ అలా జరిగిపోయింది. లేడీ ఓరియెంటెడ్ మూవీ అయినప్పటికీ 778కోట్లు రాబట్టింది. ‘బస్తర్’ రిజల్ట్ ఇలా ఉంటుందని అనుకోలేదు. కానీ అలా జరిగిపోయింది.. దట్సాల్.’ అంటూ అందంగా నవ్వేసింది ఆదా శర్మ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

