నటి స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ..దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులు
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తర్వాత నటి స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ వచ్చింది.
ముంబై : బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తర్వాత నటి స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ వచ్చింది. స్వర భాస్కర్‌ను చంపేస్తామని అజ్ఞాత వ్యక్తి నుంచి ఆమె నివాసానికి స్పీడ్ పోస్ట్ ద్వారా లేఖ అందింది. ముంబైలోని వెర్సోవాలో నటి నివాసానికి ఈ లేఖను పంపారు. స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ రావడంపై ముంబై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తన నివాసానికి బెదిరింపు లేఖ రావడంతో నటి స్వర భాస్కర్ వెర్సోవా పోలీస్ స్టేషన్లో గుర్తుతెలియని వ్యక్తులపై బుధవారం ఫిర్యాదు చేశారు. నటి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. హిందీలో రాసిన ఈ లేఖలో స్వర భాస్కర్‌కు ప్రాణ హాని తలపెడతామని అంటూ అసభ్య పదజాలంతో దూషించారని చెప్పారు. లేఖ చివరిలో ఇట్లు ఈ దేశ యువకులు అని రాసి ఉందని తెలిపారు.
వీర్ సావర్కర్‌ను అవమానిస్తే దేశ యువత చూస్తూ ఊరుకోదని లేఖలో హెచ్చరించారు. సమాజంలో జరిగే సామాజిక రాజకీయాంశాలపై స్వర భాస్కర్ చురుకుగా స్పందిస్తుంటారు. జైలు నుంచి విడిచిపెట్టాలని వేడుకుంటూ సావర్కర్ బ్రిటిష్ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పారని ఆయన వీరుడు ఎంతమాత్రం కాదని 2017లో స్వర భాస్కర్ చేసిన ట్వీట్ దుమారం రేపింది
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

