సునైనా కథానాయికగా నటించిన తమిళ చిత్రం ‘రెజీనా’. డొమిన్ డిసిల్వా దర్శకత్వం వహించారు. అదే పేరుతో తెలుగు అనువాదం త్వరలో విడుదలకానుంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘మహిళా ప్రధానంగా నడిచే కథ ఇది. థ్రిల్లర్ అంశాలతో ఆకట్టుకుంటుంది.
ఓ సాధారణ గృహిణి తనకు ఎదురైన కష్టాలకు కుంగిపోకుండా విధిని ఎదిరించి ఎలా గెలిచిందన్నదే చిత్ర కథాంశం. రెజీనాగా సునైనా పాత్ర అందరిని ఆకట్టుకుంటుంది. తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించే అన్ని అంశాలున్న సినిమా ఇది’ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పవన్.కె, సంగీతం: సతీష్ నాయర్.