Sobhita Dhulipala | స్థాయిని బట్టి కోరికలు ఉంటాయి. కలిగిన వాళ్ల కోరికలు ఒకలా ఉంటే.. లేనివాళ్ల కోరికలు ఒకలా ఉంటాయి. కానీ నటి శోభిత ధూళిపాళ కోరిక మాత్రం చిత్రవిచిత్రమైనది. పెళ్లికాని ఆడపిల్లకు ఈ తరహా కోరిక ఉండటం నిజంగా ఆశ్చర్యమే. ఇటీవల ఓ విలేకరుల సమావేశంలో తన చిరకాల వాంఛ గురించి ఆసక్తికరంగా మాట్లాడింది శోభిత. ‘నా జీవితానికి ఓ లక్ష్యం అంటూ లేదు. అది ఎటు తీసుకెళ్తే అటు వెళ్లడమే నా పని. ఆ మాటకొస్తే ఎవరైనా చివరికి చేసేది అదే.
లక్ష్యాలనేవి చెప్పుకోడానికే పనికొస్తాయి. నేను ఎప్పుడూ ప్రశాంతంగా ఉండటానికి కారణం కూడా అదే కావొచ్చు. నా వరకు నేను ఎక్కువగా కోరుకునేది మాతృత్వాన్ని. నేను అమ్మను ఎప్పుడవుతానో కానీ.. ఆ క్షణాలు నా జీవితంతో అద్భుతాలు.. అంతే. ‘అమ్మ’ అని పిలిపించుకోవడం ఎంత బావుంటుందో..’ అంటూ అందరికీ షాక్ ఇచ్చేసింది శోభిత. ఏదేమైనా అమ్మ అనిపించుకోవాలని ఆరాటపడటం మాత్రం నిజంగా గొప్ప విషయమే.