Bigg Boss-7 Telugu | రెండో వారం ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తి.. ఎమోషనల్ అయిన కంటెస్టెంట్స్..!
Bigg Boss-7 Telugu | బిగ్ బాస్-7వ సీజన్ రసవత్తరంగా సాగుతుంది. ముందు నుంచి ప్రమోషన్ చేస్తున్నట్లు అంతా ఉల్టా పల్టాలాగే నడుస్తుంది. ఇక తాజాగా ఈ సీజన్లో రెండో వారం ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. అందరూ ఊహించిన విధంగానే షకీలా ఈ వారం ఎలిమినేట్ అయింది.
Bigg Boss-7 Telugu | బిగ్ బాస్-7వ సీజన్ రసవత్తరంగా సాగుతుంది. ముందు నుంచి ప్రమోషన్ చేస్తున్నట్లు అంతా ఉల్టా పల్టాలాగే నడుస్తుంది. ఇక తాజాగా ఈ సీజన్లో రెండో వారం ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. అందరూ ఊహించిన విధంగానే షకీలా ఈ వారం ఎలిమినేట్ అయింది. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న ఏడుగురుని వరుసగా నిల్చోబెట్టి, ఒక్కొక్కరికి ఒక్కో బాక్స్ ఇచ్చి నాగార్జున ఓపెన్ చేయమన్నాడు. అందులో హ్యాపీ స్మైలీ ఎమోజీ వచ్చినవాళ్లు సేఫ్ అని, కోపంగా ఉన్న ఎమోజీ వస్తే నాట్ సేఫ్ అని చెప్పారు. చివర్లో షకీలా ఎలిమినేషన్‌ను ప్రకటించారు. టాస్క్‌లో చురుకుతనం చూపించకపోవడం, బుల్లితెర ప్రేక్షకుల్లో పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోవడంతో ఆమెకు ఓట్లు చాలా తక్కువగా వచ్చాయి. దాంతో బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయింది.
షకీలా బిగ్ బాస్ నుంచి వెళ్తుండగా హౌజ్‌మెట్స్ అందరూ భావోద్వేగానికి గురైయ్యారు. ఇక రెండో వారంలో భాగంగా జరిగిన పవర్ ఆస్త్రా ఫైనల్ రౌండ్లో ముగ్గురు కంటెస్టెంట్స్ నిలవగా.. శివాజీ వాయిస్ డెసిబెల్స్-11 వచ్చింది. అదే విధంగా అమర్దీప్ వాయిస్ డెసిబెల్స్ -6, షకీలా 9కు వచ్చింది. ఈ టాస్క్‌లో ఎక్కువ పాయింట్స్ సాధించిన శివాజీకి 2వ పవర్ అస్త్రా వచ్చింది. మొత్తానికి రెండు వారాలకు 12మంది కంటెస్టెంట్స్ మిగిలిఉన్నారు. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బుల్లెట్ భాస్కర్ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పటివరకు దీనిపై క్లారిటీ లేదు. మరి ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందా అనేది చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

