Actress Samantha | సామ్ ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్ లతో తెగ బిజీగా గడుపుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సిటాడెల్ వెబ్ సిరీస్ తో బిజీగా గడుపుతుంది. ది ఫ్యామిలీ మ్యాన్ సృష్టికర్తలు రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం సెర్భియాలో షూటింగ్ జరుపుకుంటుంది. వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్ విరామంలో చిత్ర యూనిట్ ఓ క్లబ్ కు వెళ్లి సందడి చేసింది. ఈ క్రమంలో ఊ అంటావా పాటకు సామ్ చిందులేసింది. పక్కనే ఉన్న వరుణ్ ధావణ్.. సామ్ ను డ్యాన్స్ చేయమని ఎంకరేజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
రుస్సో బ్రదర్స్ రూపొందిస్తున్న ‘సిటాడెల్’ ఫ్రాంచైజీలో ఇది ఇండియన్ ఒరిజినల్ సిరీస్. హాలీవుడ్ వెబ్ సిరీస్ లో ప్రియాంక చోప్రా నటించింది. ఇటీవలే ప్రైమ్ లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ కు మంచి ఆధరణ వస్తుంది. ఇక సిటాడెల్ నుంచి ఇప్పటికే విడుదలైన సామ్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. మోడరన్ లుక్‌లో, స్టైలిష్ కాప్‌గా సామ్ అదిరిపోయింది. దీనితో పాటుగా సామ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ సినిమా చేస్తుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సెప్టెంబర్ లో విడుదల కాబోతున్న ఈ సినిమాను మైత్రీ సంస్థ నిర్మిస్తుంది.
Samantha item song craze is unbelievable 🥵🥵#SamanthaRuthPrabhu #Pushpa pic.twitter.com/BNZ2V6BOwj
— Actress Glam (@actressglam) June 10, 2023