Actress Pragathi | రెండో పెళ్లి వార్తలపై నటి ప్రగతి ఫైర్.. ఎలాంటి ఆధారాలు లేకుండా రాస్తారా అంటూ మండిపడింది..!
Actress Pragathi | క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందలాది సినిమాల్లో నటించిన ప్రగతి గురించి గత రెండు, మూడు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రగతి త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతుందని, వరుడు కూడా దొరికేసాడని పలు మీడియా వెబ్ సైట్లు రాసుకొచ్చాయి.
Actress Pragathi | క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందలాది సినిమాల్లో నటించిన ప్రగతి గురించి గత రెండు, మూడు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రగతి త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతుందని, వరుడు కూడా దొరికేసాడని పలు మీడియా వెబ్ సైట్లు రాసుకొచ్చాయి. కాగా తాజాగా ఈ వార్తలపై ప్రగతి స్పందించింది. పెళ్లిపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అసలు ఇలా ఫేక్ వార్తలను ఎందుకు పుట్టిస్తున్నారని ఫైర్ అయింది. అంతేకాకుండా తనపై వస్తున్న దృష్ప్రచారలపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది.
ఇతరుల వ్యక్తిగత జీవితాలపై వార్తలు రాసే సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రగతి కోరింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్లుగా వార్తలు ఎలా రాస్తారని మండిపడింది. గౌరవమైన పొజిషన్లో ఉన్నప్పుడు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని కోరింది. అంతేకాకుండా వార్తలు ప్రచురించిన సంస్థపై ఫైర్ అయింది. కాగా ఆ వీడియోను కొద్ది సేపటికే డిలీట్ చేసింది.
ప్రగతి 1993లోనే చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. శభాష్ రాము అనే సినిమాలో ఓ చిన్న పాత్రలో మెరిసింది. ఆ తర్వాత దాదాపు తొమిదేళ్లు గ్యాప్ తీసుకుని బాబీ సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో మహేష్‌బాబు తల్లిగా టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఇప్పటివరకు ప్రగతి వెనక్కి తిరిగి చూసుకునే రోజు రాలేదు. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్‌లతో తెగ బిజీ అయిపోయింది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లోనూ ప్రగతి నటించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

