నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అంటే సుందరానికి’. వివేక్ ఆత్రేయ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ చిత్రం ద్వారా మలయాళీ భామ నజ్రియా ఫహద్ కథానాయికగా తెలుగు తెరకు పరిచయమవుతున్నది. ఈ సినిమాలో లీలా థామస్‌గా ఆమె పాత్రను పరిచయం చేస్తూ గురువారం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. తన కలల్ని సాఫల్యం చేసుకోవడానికి సముద్రంలో పయనించే ఫొటోగ్రాఫర్‌గా ఆమె పాత్రను చూపించారు. ఇందులో ఆమె కెమెరా పట్టుకొని దీర్ఘాలోచనల్లో ఉన్నట్లు కనిపిస్తున్నది. ట్రెండీ లుక్స్‌తో ఆకట్టుకుంటున్నది. ఆద్యంతం వినోదప్రధానంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని..నాని పాత్ర సరికొత్తగా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి, సంగీతం: వివేక్ సాగర్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్, సీఈఓ: చెర్రీ, రచన-దర్శకత్వం: వివేక్ ఆత్రేయ.